జాతీయ వార్తలు

షాబుద్దీన్‌ బెయిల్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహమ్మద్‌ షాబుద్దీన్‌ బెయిల్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. బెయిల్‌పై స్టే కోరుతూ దాఖలయిన రెండు పిటిషన్ల పై విచారించిన సుప్రీంకోర్టు షాబుద్దీన్‌ వాదనలను కూడా వినాలని అభిప్రాయపడింది. అతడికి నోటీసులు జారీ చేస్తూ, విచారణను సెప్టెంబర్‌ 26కు వాయిదా వేసింది. రెండు హత్య కేసుల్లో నిందితుడిగా ఉండడంతో షాబుద్దీన్‌ను 2005 నవంబర్‌లో జైలుకు పంపారు. 11ఏళ్ల అనంతరం ఈ సెప్టెంబర్‌ 7న పట్నా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. షాబుద్దీన్‌ బెయిల్‌పై స్టే కోరుతూ బిహార్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. షాబుద్దీన్‌ వల్ల తమ ప్రాణాలకు హాని ఉందని, అతడి బెయిల్‌ను రద్దు చేయాలని చంద్రశేఖర్‌ ప్రసాద్‌ అనే వ్యక్తి మరో పిటిషన్‌ వేశారు.