జాతీయ వార్తలు

16 ఏళ్ల తర్వాత షర్మిలను కలిసిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలని 16 ఏళ్లపాటు నిరాహార దీక్ష చేసి, ఇటీవలే దీక్ష విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఐరోం షర్మిలను ఆమె తల్లి 16 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం కలుసుకున్నారు. నిరాహారీ దీక్ష చేపట్టిన సమయం నుంచి దాన్ని విరమించే వరకూ షర్మిలను ఆమె తల్లి సాక్షీదేవి (84) ఎన్నడూ కలుసుకోలేదు. దీక్ష విరమించి, ఆస్పత్రిలో కోలుకుంటున్న షర్మిలను తల్లి సాక్షీదేవి, సోదరి కలుసుకున్నారు. ప్రస్తుతం షర్మిల ద్రవాహారం నుంచి ఘనాహారం తీసుకునేందుకు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. 16 ఏళ్ల తర్వాతైనా తన వద్దకు తల్లి, సోదరి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని షర్మిల తెలిపారు.