జాతీయ వార్తలు

షిర్డీ సాయిని ఆరాధించడం వల్లే దుర్భిక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరిద్వార్: షిర్డీ సాయిబాబాను భక్తులు ఆరాధించడంపై తరచూ విమర్శలు గుప్పించే ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హరిద్వార్ పర్యటన సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ, ఫకైరైన షిర్డీ సాయిని ఆరాధించడం వల్లే మహారాష్టల్రో కరవు విలయ తాండవం చేస్తోందన్నారు. దేవుడ్ని పూజించవచ్చని, ఫకీర్లను ఆరాధించడం తగదన్నారు. మహారాష్టల్రో దుర్భిక్ష పరిస్థితికి సాయిభక్తులే కారకులన్నారు. కాగా, శనిషింగనాపూర్ ఆలయంలో మహిళలను అనుమతించడం కూడా సరైన విధానం కాదని ఆయన అన్నారు. శనిని మహిళలు పూజించడం వారికే అరిష్టమని, ఇకపై మహిళలపై నేరాలు మరింతగా పెరుగుతాయని స్వామీజీ అన్నారు.