జాతీయ వార్తలు

అది కక్ష సాధింపే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైట్లీ ప్రోద్బలంతోనే ఐటి నోటీసులు
నేషనల్ హెరాల్డ్ కేసుపై సిబాల్

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఆరోపించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదేశాల మేరకే ఆదాయపు పన్ను శాఖ (ఐటి) కాంగ్రెస్ పార్టీకి నోటీసులు జారీ చేసిందని శనివారం ఇక్కడ విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నిధుల్లో ఎలాంటి అవకతకలు చోటుచేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. పత్రికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలన్నీ సత్యదూరమని సిబాల్ పేర్కొన్నారు. ‘మీ ఆర్థిక మంత్రి సొంత బ్లాగు అలాగే ఫేస్‌బుక్‌లో హెరాల్డ్ ఉదంతంలో కాంగ్రెస్‌కు ఐటి శాఖ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఓ దేశానికి ఆర్థిక మంత్రి అయిన వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయవచ్చా? జైట్లీ ఆదేశాల మేరకే ఐటి నోటీసులు జారీ చేయలేదా?’ అని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ఓ న్యూస్‌చానల్‌తో మాట్లాడిన సిబాల్ రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడినందుకే పార్లమెంటులో నిలదీస్తున్నట్టు చెప్పారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తులకు సంబంధించి లీజుల రద్దుపై బిజెపి పాలిత హర్యానా, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు మాట్లాడడం కక్షసాధింపుకాకపోతే ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నేత అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ 1938లో స్థాపించిన నేషనల్ హెరాల్డ్‌కు ఎంతో ఘనచరిత్ర ఉందని సిబాల్ పేర్కొన్నారు. పత్రిక నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని ప్రముఖ న్యాయవాది కూడా అయన సిబాల్ స్పష్టం చేశారు. కాగా పార్లమెంటులో జిఎస్‌టి బిల్లు ఆమోదానికి సంబంధించి కాంగ్రెస్ మూడు సవరణలు చేసిందని ఆయన తెలిపారు. తమ సూచనలు పరిగణనలోకి తీసుకుంటేనే బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆయన తేల్చిచెప్పారు. దీనిపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిఎస్‌టిని తీవ్రంగా వ్యతిరేకించారని సిబాల్ గుర్తుచేశారు.