క్రీడాభూమి

భారత్‌పై పొగడ్తలు సిగ్గుచేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్రిదీ వ్యాఖ్యలపై మియందాద్ మండిపాటు

కరాచీ, మార్చి 14: భారత్‌పై షహీద్ అఫ్రిదీ పొగడ్తల వర్షం కురిపించడం సిగ్గుచేటని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియందాద్ విరుచుకుపడ్డాడు. ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడిన అఫ్రిదీ భారత్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. అంతేగాక, భారత్‌లో అభిమానుల నుంచి తమకు ఎవరూ ఊహించనలేంతగా ఆదరాభిమానులు అందుతున్నాయని అన్నాడు. పాకిస్తాన్‌లోని అభిమానుల కంటే భారత్‌లో క్రికెట్ అభిమానులే తమను ఎక్కువగా ఆదరిస్తున్నారని పేర్కొన్నాడు. కాగా, ఈమీడియాలో వచ్చిన వార్తలను చూసి తాను విస్మయానికి గురయ్యానని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటూర్వ్యూలో మియందాద్ అన్నాడు. భారత అభిమానులు పాకిస్తాన్ క్రికెట్‌కు ఏమిచ్చారో చెప్పాలని అఫ్రిదీని, అతనితో కలిసి భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మరో సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్‌ను నిలదీశాడు. గత ఐదేళ్లుగా భారత్ నుంచి పాకిస్తాన్‌కు ఏ విధంగా ఆదరణ లభించడం లేదని అంటూ, పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించడానికి భారత్ సుముఖత వ్యక్తం చేయని విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. పాకిస్తాన్ అభిమానుల కంటే భారత్ అభిమానులే తమకు ఎక్కువ ప్రేమాభిమానాలు పంచి ఇచ్చారని అఫ్రిదీ, మాలిక్ పేర్కోవడాన్ని తప్పుపట్టాడు. వారి నుంచి ఇలాంటి వ్యాఖ్యలను తాను ఊహించలేదని అన్నాడు. మాజీ ఓపెనర్, మాజీ కోచ్ మోసిన్ ఖాన్ కూడా అఫ్రిదీ మాటలను ఖండించాడు. పాకిస్తాన్ అభిమానులను కించపరిచే విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నాడు.