జాతీయ వార్తలు

సింధు బ్రాండ్‌ వాల్యూ అమాంతం ఆకాశానికి...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ఒలింపిక్స్‌కు ముందు రూ.20 లక్షలున్న సింధు బ్రాండ్‌ విలువ రియోలో రజత పతకం సాధించడంతో రూ.2 కోట్లకు పైగా చేరిందని బ్రాండ్‌, బిజినెస్‌ స్ట్రాటజీ నిపుణుడు హరీశ్‌ బిజూర్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పలు సంస్థలు రూ.కోట్లలో ఆమెకు నగదు పురస్కారాలు ప్రకటించడంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చిందన్నారు. దీంతో ఆమెతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రఖ్యాత సంస్థలు వరుస కడుతున్నాయి. ఆమె బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ మాత్రం ఆచితూచి అడుగులు ముందుకు వేస్తోంది. పీవీ సింధు బ్రాండ్‌ మార్కెటింగ్‌ వ్యవహారాలను బేస్‌లైన్‌ వెంచర్స్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌ ఆర్‌.రామకృష్ణ చూసుకుంటున్నారు. సింధుతో ఒప్పందాల కోసం చాలా సంస్థల నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయని అయితే చివరివరకూ ఆమెతో కలిసి నడిచే, ప్రఖ్యాత సంస్థలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు రామకృష్ణ పేర్కొన్నారు.