జాతీయ వార్తలు

శైవక్షేత్రాలకు భక్తజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తజనసంద్రంగా మారాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి. తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాలతో పాటు ఇతర ప్రముఖ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచారామ క్షేత్రాలైన అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరంలోని పరమశివుడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని కురవి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు, ఏడుపాయలలో జాతర, నాగర్‌కర్నూల్‌ జిల్లా బౌరాపూర్‌ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.