జాతీయ వార్తలు

శివకుమారస్వామి శివైక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: నడిచే దేవుడిగా భక్తులు ఆరాధించే ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి శవకుమారస్వామి ఈరోజు ఉదయం 11.44కి శివైక్యం చెందారు. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులోని ప్రసిద్ధ సిద్దగంగ మఠాధిపతి అయిన కుమారస్వామి (111) గత 15 రోజులుగా ఊపిరితిత్తుల్లో ఇనె్ఫక్షన్ తలెత్తటంతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనను భక్తులు 12 శతాబ్దంలో సంఘసంస్కర్తగా బసవరూపంలో అవతరించిన అవతారమూర్తిగా ఆరాధిస్తుంటారు. లింగాయత్‌లకు ఆరాధకుడైన ఆయన సిద్దగంగ విద్యాపీఠానికి అధిపతిగా వ్యవరిస్తున్నారు. దాదాపు 125 అనుబంధ విభాగాలు, రాష్టవ్య్రాప్తంగా వివిధ కళాశాలలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్య, వసతి కల్పిస్తున్నారు. మానవతావాదిగా పేరొందిన ఈ మహనీయుడికి కేంద్రప్రభుత్వం 2015లో పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేసింది. మంగళవారం సెలవుదినంగా ప్రకటించటంతో పాటు మూడు రోజులు సంతాప దినాలుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శవకుమారస్వామి శివైక్యం చెందిన విషయం తెలుసుకుని వేలాదిమంది భక్తులు మఠానికి తరలివస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, పాటిల్, కేంద్రమంత్రి సదానందగౌడ తదితరులు ఆయన మృతికి నివాళులర్పించారు. శివకుమారస్వామి రామనగర జిల్లాలోని వీరపుర గ్రామంలో 1907 ఏప్రిల్ ఒకటిన జన్మించారు. ఆయన అంతిమసంస్కారాలు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు జరుగుతాయని మఠం నిర్వాహకులు వెల్లడించారు.