శ్రీకాకుళం

సంక్షేమ పథకాల సమీక్షకే నవ నిర్మాణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, జూన్ 7: రాష్ట్ర ప్రభుత్వం విభజన అనంతరం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి లోటుపాట్లను సవరించుకోవడానికి నవ నిర్మాణ దీక్షా సదస్సులను నిర్వహిస్తున్నామని శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్‌నాయుడు స్పష్టంచేశారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంకల్ప దీక్ష పేరుతో బుధవారం నియోజకవర్గం కేంద్రాలలో విస్తృత స్థాయి చర్చలు జరిపి ప్రభుత్వానికి తీర్మానాలు పంపించనున్నట్లు ఆయన వివరించారు. అభివృద్ధికార్యక్రమాలలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టడానికి, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించడానికి ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను మంజూరు చేయించడానికి ఈ వేదికలను తమ పార్టీ వినియోగించుకుంటుందని ఆయన తెలిపారు. సారవకోట మండలానికి సంబంధించి ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు బొంతు ఎత్తిపోతల పథకం శ్రీముఖలింగం మెగారక్షిత మంచినీటి పథకాలను సత్వరమే మంజూరు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సంకల్ప దీక్షలో తీర్మానం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా మండల కేంద్రంలో పూర్తిగా శిధిలమైన రక్షిత మంచినీటి పథకాన్ని పునర్నిర్మించడానికి వీలుగా ప్రత్యేక తీర్మాణాన్ని సంకల్ప దీక్ష సదస్సులో ఆమోదించడానికి కృషి చేస్తానని ఎంపి రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ అధ్యక్షులు సాదు కృష్ణారావు, జిల్లా కమిటీ అధికార ప్రతినిధి కత్తిరి వెంకటరమణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.