శ్రీకాకుళం

అంగరంగ వైభవంగా ఆంజనేయుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(కల్చరల్), జూన్ 9: నగరంలోని పుణ్యపువీధిలో ఉన్న అభయాంజనేయస్వామి వారి దేవాలయంలో పది రోజులుగా జరుగుతున్న హనుమజ్జయంతి ఉత్సవాలు గురువారం రాత్రి సువత్సల అభయాంజనేయస్వామి వారి కల్యాణమహోత్సవంతో ముగిశాయి. స్వామి, అమ్మవార్ల విగ్రహాలను కొలువుతీర్చి అరసవల్లి దేవస్థానం అర్చకుడు హరిబాబు ఆధ్వర్యంలో పుష్యమి నక్షత్ర మకర లగ్నమందు స్మార్తాగమం ప్రకారం శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. తొలుత మహిళలు 121 కలశలతో పురవీధుల్లో శోభాయాత్రలో పాల్గొన్నారు. చెక్క్భజన, కోలాటం, తప్పెటగుళ్లు, పులివేషాలు, తాడేపల్లిగూడెంకు చెందిన నవదుర్గలు, బరంపురం శంకువుడాన్స్ వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఊరేగింపులో సందడి చేశాయి. డే అండ్ నైట్ కూడలి, రైతు బజార్, చిన్న బజార్, ఎస్‌బిఐ, కృష్ణాపార్కు తదితర ప్రధాన కూడళ్ల మీదుగా ఈ శోభాయాత్ర కొనసాగింది. ఊరేగింపు అనంతరం మహిళలు తమ కలశలతో ఆంజనేయుని విగ్రహానికి అభిషేకం చేశారు. ఆలయ ధర్మకర్త ముక్కాట కొండబాబు, ఎస్.కృష్ణ, ఎం.రామనారాయణ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం 12గంటలనుంచి ఆలయం వద్ద అన్నధాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.