శ్రీకాకుళం

జోరుగా వెబ్ కౌనె్సలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎచ్చెర్ల, జూన్ 9: ఈ విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశానికి స్థానిక ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో హెల్ప్‌లైన్ సెంటర్‌లో నిర్వహిస్తున్న వెబ్‌కౌనె్సలింగ్ జోరుగా సాగుతోంది. గురువారం 343మంది అభ్యర్థులు సర్ట్ఫికేట్ పరిశీలనకు ముందుకు వచ్చారు. ఓసీ, బీసీలు 324మందికాగా ఎస్సీ, ఎస్టీలు 19మంది ఉన్నారు. ఇప్పటివరకు 1342మంది కౌన్సిలింగ్‌కు ముందుకు వచ్చి వెబ్ ఆప్షన్ వైపు పరుగులు తీస్తున్నారు.
హెల్ప్‌లైన్ సెంటర్ సాక్షిగా పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు గస్తీ నిర్వహించి ముందస్తు ప్రణాళికతో వారి వారి కళాశాలలోని హైలెట్స్ విద్యార్థులు ముందుంచే బ్రోచర్స్‌తో ప్రచారాన్నిముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెబ్ ఆప్షన్‌కు ఆసక్తి కనబరిచిన అభ్యర్థులకు నజరానాలను ప్రకటించడంలో కూడా పోటీ పడుతున్నారు. ప్రిన్సిపల్ వి ఎస్ దత్తు, ఇంచార్జ్ కె.శివకుమార్‌లు విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి వెబ్ ఆప్షన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందిస్తున్నారు.