శ్రీకాకుళం

పెద్ద మార్కెట్ సమస్యలు పరిష్కారిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 9: ప్రజాసమస్యలే ఊపిరిగా.. రాజకీయాలు నెరిపిన దివంగత కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు ఆశయాలకు అనుగుణంగా తనయుడు ఎం.పి. రామ్మోహన్‌నాయుడు ముందుకు సాగుతున్నారు. ఇక్కడ పొట్టిశ్రీరాములు మార్కెట్‌ను ఎం.పి. రామ్మోహన్‌నాయుడు సాధారణ కొనుగోలుదారుడుగా బజార్‌లో కూరగాయలు వర్తకుల నుంచి కొనుగోలు చేస్తూ గురువారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని మార్కెట్ సంఘం పిలుపుమేరకు ఆయన గురువారం పొట్టిమార్కెట్ మొత్తం కలియ తిరిగారు. రోడ్డుపై కూరగాయలు అమ్ముతుండటాన్ని చూసిన ఆయన నూతనంగా భవనాలు కట్టించారు కదా, ఎందుకు ఆయా భవనాలను స్వాధీనం చేసుకోవడం లేదని అక్కడి వర్తకులను ప్రశ్నించారు. వర్తకులంతా ఎం.పి. వద్ద ఏకరువు పెడుతూ అప్పటి మున్సిపల్ అధికారుల అనాలోచిత చర్యల కారణంగా కోట్ల రూ.లు వెచ్చించి నిర్మించిన భవనాలు తమకు ఎందుకూ పనికిరాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి
మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు చలువతో మార్కెట్ భవనాలు నిర్మించినప్పటికీ, ఎన్నికలు రావడంతో ఆయన తమ సమస్యలపై స్పందించకుండా పోయిందన్నారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి రెండేళ్లు అవుతున్నా తమ సమస్యలపై పట్టించుకున్న నాథుడు లేడని వారు చెప్పగా సమస్యల పరిష్కారానికే తాను వచ్చినట్లు వారికి భరోసానిచ్చారు. అనంతరం ఎం.పి. మార్కెట్‌లో పారిశుద్ధ్య సమస్యను చూసి చలించిపోయారు. జిల్లా కేంద్రానికి పెద్ద దిక్కు అయిన ఇంతటి మార్కెట్‌లో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండటాన్ని ప్రశ్నించారు. అక్కడి నుండి నూతనంగా నిర్మించిన భవనాలను పరిశీలిస్తుండగా, డి బ్లాక్ భవనంలో పశువులు, కుక్కలు నివాసం ఉండటాన్ని ఆయన గమనించారు. అనంతరం ఆయన వర్తకులతో మాట్లాడుతూ తాను నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి సాధారణ నిధులతో మార్కెట్ అభివృద్ధికి కృషిచేస్తానని, సమస్యను పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఎంపి ల్యాడ్ నిధుల నుండి అవసరమైతే నిధులను కేటాయిస్తానని చెప్పారు. మార్కెట్ అభివృద్ధిపై త్వరలోనే ఓ ప్రణాళికను తయారుచేసి అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటానన్నారు.