శ్రీకాకుళం

‘కల్తీ’ వాసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 9: ప్రజా ఆరోగ్యంపై బాధ్యత లేని సిండికేట్ నేతలు చేస్తున్న మద్యం వ్యాపారంలో కల్తీ గుట్టు రట్టు అయ్యింది. జిల్లా కేంద్రంతోపాటు పాతపట్నం, చాపర ప్రాంతాల్లో గురువారం అబ్కారీశాఖ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. సుమారు 30 వేల మద్యం సీసాలకు అమర్చేందుకు కొత్తగా తయారైన కప్పులు ఈ దాడుల్లో వెలుగుచూశాయి.
కేవలం కల్తీ మద్యం అమ్మకాలకు సర్కార్ వేసిన సీల్డ్‌కప్పులు తప్పించి వాటిస్థానంలో ఈ నకిలీ కప్పులు అమర్చేందుకు వినియోగిస్తున్నారన్న అనుమానాలతో అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ సురేందర్‌ప్రసాద్ విచారణకు ఆదేశాలు ఇచ్చారు. అబ్కారీ శాఖ ఆదాయ లక్ష్యం 40 కోట్లు. దీంతో కిందిస్థాయి అధికారులు సిండికేట్ వ్యాపారులతో కలిసి వ్యాపారాన్ని పరుగులెత్తించాలని అధికారులు హుకుం చేశారు. జిల్లాలో 232 మద్యం దుకాణాలకు 149 దుకాణాల్లో కల్తీ మద్యం అమ్మకాల జోరు పెంచినట్టు అబ్కారీ ఉన్నతాధికారులు (హైదరాబాద్)కు ఆకాశరామన్న ఉత్తరం వెళ్లడంతో కల్తీ మద్యం డొంక కదిలింది. ప్రతీ నెలా 20 నుంచి 40 కోట్ల రూపాయల మద్యం అమ్మకాల లక్ష్యంలో 20 కోట్ల రూపాయలు మీడియం బ్రాండ్‌లో చీప్‌లిక్కర్ కల్తీ చేసి శ్రీకాకుళం కేంద్రంగా తయారైన కప్పులను బిగించి మందుబాబులకు అమ్మేస్తున్నట్టుగా అబ్కారీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ప్రీమియం విస్కీ బ్రాండుల్లో సురక్షితమైన వాటర్ ప్యాకెట్లు కలిపే మరల వాటికి సరికొత్త కప్పులు బిగించి అబ్కారీ లేబులు పైపైన అంటించి 750 ఎం.ఎల్. బాటిల్స్ యథేచ్ఛగా మార్కెట్‌లోకి పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందన్న సంగతిని గ్రహించిన అబ్కారీ అధికారులు ఈ వ్యవహారాన్ని రట్టుచేశారు.
కల్తీ ఇలా...
చీప్‌లిక్కర్ 750 ఎం.ఎల్.(్ఫల్‌బాటిల్) ధర 200-400 రూపాయల వరకూ ఉంది. ఈ చీప్‌లిక్కర్‌ను మీడియం రేంజ్ బ్రాందీ, విస్కీ బాటిల్స్‌లో 60 ఎం.ఎల్. మిక్సింగ్ చేసి అబ్కారీ కప్పుకు బదులుగా తయారీ కప్పును అమర్చి అమ్మకాలు చేసే విధానాన్ని అబ్కారీశాఖ పసిగట్టింది. ప్రీమియం విస్కీ 750 ఎం.ఎల్. ఫుల్‌బాటిల్ 1600-3000 రూపాయల వరకూ ఎం.ఆర్.పి. ఉండగా, ఆ బాటిల్స్‌లో సురక్షితమని చెప్పే ప్యాకెట్టు నీరు 90 ఎం.ఎల్. వరకూ కలిపి సరికొత్త కప్పులతో సీల్డ్ చేసి అబ్కారీ స్టిక్కర్లు అమర్చి అమ్మేస్తున్న అధికారులు తెలుసుకున్నారు. అయితే, అటువంటి కేసులు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా జిల్లా అబ్కారీశాఖ నమోదు చేయలేదు.
విచారణ చేస్తాం
మద్యం బాటిల్స్ కోసం తయారు చేసిన కప్పులేనంటూ నిర్థారణకు వచ్చినప్పటికీ, వీటిని వినియోగించేలా ఆధారాలు ఇంకా దొరకలేదని, విచారణ చేస్తామంటూ జిల్లా అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ సురేంద్రప్రసాద్ మీడియాతో చెప్పారు. కల్తీ మద్యం అమ్మకాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నామని, హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన దాడుల్లో మద్యం బాటిల్స్‌కు అమర్చే కప్పులు తయారీ కేంద్రాలు కాకుండా, పాతపట్నం, చాపర, శ్రీకాకుళం పట్టణంలో పలు ప్రాంతాల్లో దొరికాయని, మద్యం దుకాణాల్లో పెద్దఎత్తున ఈ కప్పులు లేవంటూ వివరించారు.