శ్రీకాకుళం

బదిలీలు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 10: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ఈనెల 20 నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర చంద్రబాబునాయుడు అన్నారు. కార్యాలయాల కంప్యూటరీకరణపై కలెక్టర్లతో శుక్రవారం సాయంత్రం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరు ఆధారంగా బదిలీలు నిర్వహించాలన్నారు. ఈనెల 14లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 15నుంచి 17వరకు పనితీరు ఆధారిత బదిలీ కౌనె్సలింగ్ ఉంటుందన్నారు. 20 నాటికి బదిలీ స్థానంలో చేరాలన్నారు. ఐదేళ్లు పూర్తయిన వారికి విధిగా బదిలీ చేయాలని పేర్కొంటూ 20శాతం మించకుండా బదిలీలు ఉండాలన్నారు. బదిలీలకు సాధారణంగా మూడేళ్లు గిరిజన మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి రెండు రెండేళ్లు అర్హతగా ప్రకటించారు. బదిలీల తీరు ప్రతీ రోజు సిఎం డాస్ బోర్డుపై పొందుపరచాలన్నారు. మొదటి దశలో బదిలీ కాంపిటెంట్ అథారిటీలను బదిలీ చేయాలని శాఖాధికారులను ఆదేశించారు. బదిలీలు పారదర్శకంగా జరగాలన్నారు. ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 22 నుంచి పల్స్ సర్వే ఉంటుందని ఆయన అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జెసి వివేక్‌యాదవ్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.