శ్రీకాకుళం

ప్రమాదాల నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), జూన్ 10: రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పాటూరి లక్ష్మీనృసింహం అన్నారు. మండలంలోని మునసబుపేటలో ఉన్న గాయిత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్‌లో శుక్రవారం పాఠశాలల బస్సు డ్రైవర్లకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమాన్ని రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లకు చంద్రన్న బీమా పథకం గురించి అవగాహన కల్పించి వారికి వర్తింపజేయాలన్నారు. డ్రైవర్లకు ముఖ్యంగా కంటిచూపు, వాటిసంరక్షణ అవసరమని అందుకు సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా ప్రత్యేకంగా కంటి పరీక్షలు చేయించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పాఠశాలల డ్రైవర్లు మరింత అప్రమత్తంగా ఉండి విద్యార్థులను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేర్చాలన్నారు. అందుకు ట్రాఫిక్ నిబంధనలను, రోడ్డు భద్రతపై కూడా కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. రోడ్డుపరిస్థితిని బట్టి బస్సులను నడపాలన్నారు. ఈనెల 21 యోగా డేగా జరుపుకొంటున్నామని అందుకు ప్రతీ ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. యోగా అనేది భారతదేశంలో పుట్టి ఇతర దేశస్థులు వాటి ఫలితాలను అనుభవిస్తున్నారని, యోగా ఫలితాలు దేశ ప్రజలు కూడా అనుభవించాలన్నారు. గంటకి 17మంది భారతదేశంలో రోడ్డుప్రమాదాల్లో మరణిస్తున్నారని జిల్లాలో సగటున నెలలో రోజుకి ఒకరు చనిపోతున్నట్టు తెలిపారు. ఈ ప్రమాదాలను ఇంకా తగ్గించుకునేందుకు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. అనంతరం ప్రథమ చికిత్సపై రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. డిటిసి సిహెచ్ శ్రీదేవి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, గురజాడ విద్యా సంస్థల అధినేత జివి స్వామినాయుడు, బిఇడి కళాశాల ప్రిన్సిపల్ రంగారావు, కళాశాల కో ఆర్డినేటర్ అంప్లాం శ్రీనివాసబాబు, ట్రాన్స్‌పోర్ట్ అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.