శ్రీకాకుళం

రూ.90 కోట్లతో ముద్దాడపేట వద్ద వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమదాలవలస, జూన్ 10: మండలంలోగల ముద్దాడపేట గ్రామం వద్ద నాగావళి నదిపై సుమారు రూ.90కోట్లతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తున్నట్టు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో పొందూరు, ఆమదాలవలస మండలాలను అనుసంధానం చేసి నాగావళి నదీ తీరంలో ఉన్న సుమారు 120 గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు తాను ఈ ప్రతిపాదనలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ముద్దాడపేట నుండి పొందూరు మండలం తాడివలస, సింగూరు వంటి గ్రామాలను కలుపుతూ వంతెన నిర్మాణానికి రెండేళ్లుగా సర్వే నిర్వహించి నేటికి అంచనాలను తయారు చేసినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించడానికి ప్రతిపాదిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలోగల బూర్జి, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలంకు సంబంధించి రూ.35 కోట్లతో ఆర్ అండ్ బి రహదారులు ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అదే విధంగా 190 గ్రామాలకు రూ.175కోట్లతో మంచినీరు అందించేందుకు పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఇందులో 156 పనులు మంజూరై ఉండగా మరో 39 పనులు మంజూరు కావాల్సి ఉందని విప్ రవికుమార్ తెలిపారు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.