జాతీయ వార్తలు

31 మంది సిబిఐ అధికారులకు పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సిబిఐకి చెందిన 31 మంది అధికారులకు రాష్టప్రతి పోలీసు పతకాలను, పోలీసు పతకాలను ప్రదానం చేసింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న అధికారులతో పాటు ఉపాధ్యాయుల నియామక కుంభకోణంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాను ప్రాసిక్యూట్ చేయడంలో విజయవంతమైన అధికారులు ఈ పతకాలను పొందిన వారిలో ఉన్నారు. ఆదివారం ప్రకటించిన ఈ అవార్డుల జాబితాలో ఐపిఎస్ అధికారులు కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరిలో సిక్కిం క్యాడర్ 2000 సంవత్సరం ఐపిఎస్ బ్యాచ్‌కి చెందిన అశ్వనీ కుమార్ చంద్ ఒకరు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంతో పాటు ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా చీటింగ్ కేసులపై దర్యాప్తు జరుపుతున్న సిబిఐ ప్రత్యేక బృందంలో సభ్యుడిగా ఉన్న అశ్వనీ కుమార్ చంద్‌కు పోలీసు ప్రతిభా పతకాన్ని ప్రదానం చేశారు. అలాగే గౌహతిలో సిబిఐ డిఐజిగా నియమించిన మరో ఐపిఎస్ అధికారి నవ్‌జ్యోతి గొగోయ్‌ని కూడా పోలీసు ప్రతిభా పతకంతో ప్రభుత్వం గౌరవించింది. ఈయన కూడా 2000 సంవత్సరం ఐపిఎస్ బ్యాచ్‌కు చెందినవారే అయినప్పటికీ రాజస్థాన్ క్యాడర్‌కు చెందినవారు.

పాక్ కాల్పుల కవ్వింపు

కాశ్మీర్ సరిహద్దులో ఫిరంగులతో దాడులు
ఎదురు కాల్పులు జరిపిన భారత దళాలు’
జమ్ము, ఆగస్టు 14: భారత్ దళాల నుంచి ఎలాంటి కవ్వింపు లేకుండానే పూంచ్ జిల్లాలోని అధీనరేఖ ప్రాంతంలో పాకిస్తాన్ సైనిక దళాలు ఆదివారం తీవ్రస్థాయిలో కాల్పులకు ఒడిగట్టాయి. మొదట్లో తేలికపాటి మిషన్‌గన్లతో కాల్పులు జరిపిన పాక్ సైనికులు అనంతరం ఫిరంగి దాడులకు కూడా ఒడిగట్టినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఆకస్మిక కాల్పులకు ప్రతిగా భారత్ దళాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. అయితే కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇలావుండగా పాక్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వాఘా సరిహద్దులో భారత సైనికులు పాక్ దళాలకు మిఠాయిలు పంచినప్పటికీ, పాక్ దళాలు కాశ్మీర్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం గమనార్హం.