క్రీడాభూమి

సాకర్ అభిమానుల వీరంగం.. విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీస్‌లో దేశవాళీ టోర్నీ మ్యాచ్ రద్దు
ఏథెన్స్, నవంబర్ 22: గ్రీస్ దేశవాళీ ఫుట్‌బాల్‌లో చిరకాల ప్రత్యర్థులు పనథినకొస్, ఒలింపియాకొస్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అభిమానులు వీరంగం చేసి, చివరికి మ్యాచ్‌ని నిలిపివేసేందుకు కారకులయ్యారు. హోం గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైన ఒలింపియాకొస్‌కు పెద్దఎత్తును హర్షధ్వానాలతో స్వాగతం పలికిన అభిమానులు పనథినకొస్ జట్టు సభ్యులు మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే చేతికి అందిన వస్తువులను విసురుతూ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. చాలామంది మైదానంపైకి పరుగులు తీశారు. మ్యాచ్‌ని మొదలుపెట్టేందుకు సుమారు అరగంట సేపు వేచి చూసిన తర్వాత, పరిస్థితులు అనుకూలంగా లేవని రిఫరీ ఆండ్రియాస్ పపాస్ ప్రకటించాడు. ఈ పరిస్థితుల్లో మ్యాచ్‌ని రద్దు చేయక తప్పడం లేదని స్పష్టం చేశాడు. కాగా, మ్యాచ్ రద్దయినట్టు ప్రకటన వెలువడిన వెంటే అభిమానులు విధ్వంసానికి పూనుకున్నారు. స్టేడియం లోపల, వెలుపల కనిపించిన ప్రతి వాహనానికి నిప్పుపెట్టారు. వీధుల్లోకి వెళ్లి రాళ్లు రువ్వారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా సిబ్బంది లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. భాష్పవాయువును ప్రయోగించక తప్పలేదు. మొత్తం మీద ఈ ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలైనట్టు గ్రీస్ మీడియా పేర్కొంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.