జాతీయ వార్తలు

అక్రమ చొరబాట్లను నియంత్రిస్తాం: సోనోవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి: అస్సాంను ప్రధానంగా వేధిస్తున్న అక్రమ చొరబాట్లను పూర్తిస్థాయిలో నివారిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న బిజెపి నేత శర్వానంద సోరోవాల్ శనివారం స్పష్టం చేశారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు బంగ్లాదేశ్ సరిహద్దులను శాశ్వతంగా మూసేవేసేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండేళ్ల వ్యవధి ఇచ్చారని, ఈలోగానే చొరబాటుదారులను గుర్తించేందుకు హేతుబద్ధంగా అధ్యయనం జరుగుతుందన్నారు. చట్ట ప్రకారం చొరబాటుదార్లపై చర్యలు తీసుకుని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే తన ధ్యేయమన్నారు.