కర్నూల్

త్వరలో పోలీసుల బడిబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎస్పీ ఆకే రవికృష్ణ
ఆలూరు, నవంబర్ 20:జిల్లా పోలీ సు యంత్రాంగం ఇక నుంచి బడిబాట పట్టనున్నట్లు ఎస్పీ రవికృష్ణ వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఎస్పీ ఆలూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడు తూ కర్నూలు జిల్లాలో విద్యాపరంగా పూర్తిగా వెనుకబడిందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 141 గ్రామాలను పోలీసులు దత్తత తీసుకుని ఆయా గ్రామాల్లో ఒకే అంశంపై దృష్టి సారిస్తామన్నారు. పోలీసులు ఒకొక్కరు ఒక్కో గ్రామం దత్తత తీసుకుని ఆ గ్రామంలో బడిబాటపై దృష్టి కేంద్రికరించి ఆయా పాఠశాలల్లో సౌకర్యాల కల్పన, విద్యార్థుల చదువుపై, బాలికలకు మరుగుదొడ్లు సౌకర్యం కల్పిస్తామన్నారు. జిల్లాలో 83 పోలీస్‌స్టేషన్లు ఉన్నాయని 83 మంది ఎస్‌ఐలు, 34 మంది సిఐలు ఒకొక్కరు ఒక గ్రామం దత్తత తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా ఆలూరు ఎస్‌ఐ అరికేర గ్రామాన్ని, సిఐ బెల్డోణ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ఎస్పీకి వివరించారు. ఈ బడిబాట విషయం త్వరలో మొదలు పెడుతామని ఎస్పీ వెల్లడించారు. ఇకపోతే జిల్లాలో గొలుసు దొంగతనాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వసతి గృహాల్లో అపరిశుభ్రతపై ఎస్పీ అసంతృప్తి
పోలీస్ స్టేషన్ ఆవరణలో, క్వార్టర్స్ ఆవరణంలో పిచ్చి మొక్కలు ఉండ డం, పందులు సంచరిస్తుండడం, అపరిశుభ్రంగా ఉండడం పట్ల జిల్లా ఎస్పీ రవికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఎస్పీ ఆలూరు పోలీసు వసతిగృహాన్ని పరిశీలించారు. 10 రోజుల్లోగా పరిసరాలను పరిశుభ్రం చేసి పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సిబ్బంది వసతిగృహాల పరిసరాల్లో ఉన్న ముస్లిం పిల్లలతో జిల్లా ఎస్పీ ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులతో మాట్లాడుతూ ఎవరైనా రౌడీయి జం చేస్తున్నారా అని అడిగి విచారించారు. మూసనహళ్ళి సర్పంచ్ సోమశేఖర్, టిడిపి నేత ఎల్లప్పతో ఎస్పీ మాట్లాడుతూ ఈ గ్రామాల్లో ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి సిఐ, ఎస్‌ఐ ఆయుదాలను పరిశీలించి వీటిని శుభ్ర పరిచి ఎన్ని రోజులు అయిందని ఎస్పీ విచారించారు. అనంతరం జిల్లా ఎస్పీ అరికేర గ్రామంలో పర్యటించారు. ఎస్పీ వెంట సిఐ శంకరయ్య, ఎస్‌ఐ ధనుంజయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసుల వేధింపులు తాళలేక
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
* జొన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో ఘటన
గుత్తి, నవంబర్ 20: పోలీసుల వేధింపులు తాళలేక కర్నూలు జిల్లా జొన్నగిరి పోలీస్‌స్టేషన్‌లో హరిప్రసాద్ శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరా లు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చెన్నంపల్లికి చెంది న హరిప్రసాద్ అక్కడి గ్రానైట్ క్వారీలో జెసిబి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వారం రోజుల క్రితం చెన్నంపల్లి సమీపంలోని మరో గ్రానైట్ క్వారీలో రెండు ఖాళీ డ్రమ్ములు చోరీకి గురయ్యాయి. ఈ సంఘటనపై జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా జొన్నగిరి పోలీసులు హరిప్రసాద్‌తో పాటు మరో ముగ్గురిని నాలుగు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కాగా కేసు ఒప్పుకోవాలని తమ వారిని వేధింపులకు గురిచేసినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. డబ్బు ఇస్తే కేసు లేకుండా చేస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు చొప్పున తీసుకుని తీరా శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచేందుకు సిద్ధమైనట్లు వారు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న హరిప్రసాద్ తీవ్ర మనస్థాపానికి గురై పోలీస్‌స్టేషన్‌లోనే పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న హరిప్రసాద్ కుటుంబసభ్యులు, మిగతా ముగ్గురి బంధువులు, గ్రామస్థులు స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, చెన్నంపల్లి గ్రామస్థుల మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. హరిప్రసాద్‌ను అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా హరిప్రసాద్ ఆత్మహత్యయత్నానికి కారకులైన జొన్నగిరి పోలీసులపై కేసు నమోదు చేయాలని హరిప్రసాద్ భార్య సుకన్య, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.
నల్లమలలో గుప్తనిధుల ముఠా!
ఆత్మకూరు, నవంబర్ 20: నల్లమల అడవిలోని గుప్తనిధుల ముఠా సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఈ ముఠా సభ్యులు నాగలూటి రేంజ్‌లోని వీరభద్రస్వామి దేవాలయం సమీపంలో ఉన్న వినాయకగుడిలోని గుప్తనిధుల కోసం వచ్చినట్లు తెలుస్తోంది. ఆరుగురు సభ్యుల ముఠా గుడి గోడను పగులగొట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. అయితే గోడ గట్టిగా ఉండడంతో వారు విరమించుకున్నట్లు తెలుస్తోంది. కాగా గుప్తనిధుల ముఠా సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది ఆలయం వద్దకు వెళ్లి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు. దీనిపై డిఎఫ్‌ఓ సెల్వమ్ మాట్లాడుతూ కొంతమంది గుప్తనిధుల కోసం వినాయకుగుడి గోడను కూల్చే ప్రయత్న చేసింది వాస్తవమేనన్నారు. విషయం తెలియగానే సిబ్బందిని అక్కడికి పంపామన్నారు. అక్కడ ఎవరూ కనిపించలేదన్నారు. ముఠా సభ్యుల కోసం నల్లమలలో గాలిస్తున్నామని ఆయన వివరించారు.