క్రీడాభూమి

ఇది ఆరంభమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్ ప్రస్థానంలో ఇది ఆరంభం మాత్రమేనని, వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత ‘లెజెండరీ క్రికెటర్’ సచిన్ తెండూల్కర్ అన్నాడు. బాడ్మింటన్ స్టార్, తెలుగు అమ్మాయి సింధు రియోలో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల రెజ్లింగ్‌లో సాక్షి కాంస్య పతకాన్ని గెల్చుకున్న విషయం తెలిసిందే. మూడో స్థానాన్ని తృటిలో చేజార్చుకొని, నాలుగో స్థానంతో సంతృప్తి చెందినప్పటికీ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ లక్షలాది మంది అభిమానులను సంపాదించింది. చివరి క్షణం వరకూ ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కాగా, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సైనా నెహ్వాల్‌కు, రియోలో రజతకాన్ని అందించిన సింధుకు కోచ్‌గా ఉన్న గోపీచంద్‌పైనా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ నలుగురికీ ఆదివారం సచిన్ బిఎండబ్ల్యు కార్లను బహూకరించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ భారత క్రీడా చరిత్రలోనే సింధు, సాక్షి పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నాడు. దేశం మొత్తం ఆనందంతో ఉప్పొంగిపోతున్నదని, ఇలాంటి సందర్భాలు ఇంకా అనేకం వస్తాయన్న నమ్మకం తనకు ఉందని రియో ఒలింపిక్స్‌కు భారత బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తెలిపాడు. కోచ్‌గా విశిష్ట సేవలు అందిస్తున్నాంటూ గోపీచంద్‌ను సచిన్ ప్రశంసించాడు. అంతరూ గోపీని ఆరాధిస్తున్నారని, తన దృష్టిలో నిజమైన హీరో అతనేనని పేర్కొన్నాడు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు మరిన్ని పతకాలు దక్కుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. గోపీని స్ఫూర్తిగా తీసుకొని, మిగతా కోచ్‌లు కూడా మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేయాలని పిలుపునిచ్చాడు.

చిత్రం.. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బాడ్మింటన్ స్టార్ పివి సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్‌తోపాటు, అద్భుత ప్రతిభ కనబరచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, కోచ్ గోపీచంద్‌లకు హైదరాబాద్‌లో బిఎండబ్ల్యూ కార్లను బహూకరించిన భారత మాజీ క్రికెటర్, ఎంపీ సచిన్ తెండూల్కర్