అనంతపురం

శిక్షణలో నైపుణ్యాన్ని పెంచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలమత్తూరు, సెప్టెంబర్ 12:పోలీసు, హోంగార్డు తదితర పోలీసు శాఖకు సంబంధించిన ఇచ్చే శిక్షణలో అభ్యర్థులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎస్పీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొడికొండ జాతీయ రహదారిలో ఉన్న రక్షా అకాడమీలో 100వ బ్యాచ్ శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షా అకాడమీ చైర్మన్ గ్రంథి మల్లికార్జున రావు మాట్లాడుతూ, రక్షా అకాడమీ ద్వారా వివిధ రంగాలకు సంబంధించి శిక్షణ ఇచ్చి నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతోందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన అనేక మంది అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారన్నారు. భవిష్యత్తులో కూడా మరెన్నో శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ, రక్షా అకాడమీలో శిక్షణ పొందడంతోపాటు సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిజిపి హెచ్‌డి దొర, మాజీ ఐపిఎస్ డైరెక్టర్ ఎంఆర్‌రెడ్డి, విశ్రాంత ఐపిఎస్ అధికారి శాస్ర్తీ, బిజినెస్ చైర్మన్ పిఎం కుమార్, బ్రిగేడిర్ సిఎన్ కమాండర్ నజీముద్దీన్, డిఎస్పీ సుబ్బారావు, ఎస్సై జమాల్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

వ్యక్తి ఆత్మహత్య
లేపాక్షి, సెప్టెంబర్ 12:మండల పరిధిలోని మానేపల్లి గ్రామానికి చెందిన ఓబన్న (29) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న స్థానికులు 108 వాహనంలో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరిలించారు. చికిత్సలు పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ పైనుండి పడి వ్యక్తి మృతి
ఓబుళదేవరచెరువు, సెప్టెంబర్ 12: మండల పరిధిలోని కుంట్లపల్లికి చెందిన మద్దె సూర్యనారాయణ నాయుడు (45) సోమవారం ట్రాక్టర్ పైనుండి పడి మృతి చెందాడు. ఎస్ ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. మృతుడు సూర్యనారాయణ ఉదయం కుంట్లపల్లి నుండి సొంత పని నిమిత్తం ఓడిసికి వచ్చాడు. కుంట్లపల్లికి చెందిన ట్రాక్టర్‌లో స్వగ్రామంకు తిరుగు ప్రయాణం చేస్తుండగా నారప్పగారిపల్లి బ్రిడ్జి వద్ద కిందపడ్డాడు. ట్రాక్టర్ పైనుండి పడడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక ట్రాక్టర్లు సీజ్
పెద్దవడుగూరు, సెప్టెంబర్ 12:మండలంలోని వంకల నుండి పరిమతికి మించిన లోడుతో వెళ్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను పెద్ద వడుగూరు ఎస్‌ఐ రమణారెడ్డి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుస్టేషన్‌కు తరలించారు.
పట్టణంలో భారీ చోరీ
* 75 తులాల బంగారు, రెండు కిలోల వెండి, రూ.1.65లక్షల నగదు చోరీ
ధర్మవరం, సెప్టెంబర్ 12: పట్టణంలోని కేశవనగర్‌లో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. కేశవనగర్‌కు చెందిన గైక్వాడ్ రమేష్ ఇంటిలో కుటుంబీకులతో కలసి బెడ్‌రూమ్‌లో ఆదివారం రాత్రి పడుకున్నారు. దొంగలు హాలులోని కిటికీ ఊచలను తొలగించి ఇంటిలోకి వెళ్లి బీరువాలను పగులగొట్టి అందులోని 75 తులాల బంగారు నగలు, రెండు కిలోల వెండి సామగ్రితోపాటు రూ.1.65 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ చోరీ జరుగు సమయంలో కింది భాగంలోని ఇంటి యజమానికి శబ్దం రావడంతో గమనించి ఫోన్‌లో సమాచారాన్ని రమేష్‌కు తెలిపాడు. దీంతో రమేష్ నిద్ర లేచి హాలు తలుపులు వేసుకొని పడుకున్నాడు. అయితే దొంగలు దోచుకొని కిటికీ ద్వారా పలాయనం చిత్తగించారు. ఇందుపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే క్లూస్‌టీమ్‌తోపాటు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపి డీఎస్పీ వేణుగోపాల్, సీఐ హరినాథ్, ఎస్‌ఐ సునీత, సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
తృటిలో తప్పిన ప్రమాదం
చిలమత్తూరు, సెప్టెంబర్ 12:మండల పరిధిలోని కోడూరు జాతీయ రహదారిలో ఐచర్ వాహనం బోల్తా పడిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. కంబదూరు నుండి కోలార్‌కు టమోటా లోడుతో ఐచర్ వాహనం వెళుతుండగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో డివైడర్లను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇందులో డ్రైవర్, క్లీనర్‌తోపాటు పలువురు ప్రయాణీకులు ఉండగా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.