క్రీడాభూమి

బెకర్‌కు జొకోవిచ్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, డిసెంబర్ 7: గత మూడు సీజన్లు తనకు కోచ్‌గా వ్యవహరించిన మాజీ ప్రపంచ నంబర్ వన్ బోరిస్ బెక్‌తో నొవాక్ జొకోవిచ్ తెగతెంపులు చేసుకున్నాడు. బెకర్ కోచ్‌గా ఉన్న సమయంలోనే జొకోవిచ్ ఆరు మేజర్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. ఇకపై బెకర్ తనకు కోచ్‌గా ఉండడం లేదని జొకోవిచ్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. విడిపోదామన్నది తమ ఇద్దరి సమష్టి నిర్ణయమని ప్రకటించాడు. ఇద్దరం కలిసి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నామని, వాటిని సమర్థంగా పూర్తి చేయగలిగామని జొకోవిచ్ పేర్కొన్నాడు. ఇక మీద కెరీర్‌లో అన్ని నిర్ణయాలను తానే స్వయంగా తీసుకోవాలని అనుకుంటున్నానని, అందుకే బెకర్‌ను కోచ్‌గా కొనసాగడం లేదని వివరించాడు. ఇలావుంటే, జొకోవిచ్ ఇప్పటి వరకూ కెరీర్‌లో 12 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించాడు. వాటిలో సగం బెకర్ కోచ్‌గా ఉన్నప్పుడు లభించినవే కావడం విశేషం. రోజర్ ఫెదరర్ (17 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు), పీట్ సంప్రాస్, రాఫెల్ నాదల్ (చెరి 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు) మాత్రమే అత్యధిక టైటిళ్ల జాబితాలో జొకోవిచ్ కంటే ముందున్నారు. బెకర్ మార్గదర్శకంలో జొకోవిచ్ 2014, 2015 సంవత్సరాలను నంబర్ వన్‌గా ముగించాడు. ఈఏడాది ఆండీ ముర్రే అగ్రస్థానానికి దూసుకెళ్లగా అతను ద్వితీయ స్థానంలో ఉన్నాడు.