జాతీయ వార్తలు

ఏపికి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇందుకోసం విభజన చట్టాన్ని సవరించాలి
రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టిన కెవిపి
సమర్థించిన కెకె, ఆనంద భాస్కర్

న్యూఢిల్లీ, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కెవిపి రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆయన డిమాండ్‌ను టిఆర్‌ఎస్ పక్షం నాయకుడు కె.కేశవరావు, కాంగ్రెస్ సభ్యుడు ఆనందభాస్కర్ బలపరిచారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుగా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ శుక్రవారం రాజ్యసభలో ఆయన ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో విభజన బిల్లుపై మాట్లాడుతూ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదాను ప్రతిపాదిస్తే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ దీన్ని పదేళ్లకు పెంచాలని డిమాండ్ చేయటం మరిచిపోయారా? అని రామచంద్రరావు ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్ర-తెలంగాణా కౌన్సిల్‌ను ప్రధాని అధ్యక్షతన ఏర్పాటు చేసి ఇద్దరు ముఖ్యమంత్రులను సభ్యులుగా నియమించాలని ఆయన బిల్లులో ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పుంజుకునేంత వరకు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని పెంచేందుకు ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని, రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయం చేయాలని కోరారు. జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కేటాయింపులను గణనీయంగా పెంచాలన్నారు. కృష్ణ,గోదావరి నదీ జలాల బోర్డులను క్రియాన్వయం చేయాలని ఆయన కోరారు. బోర్డులు,కార్పొరేషన్లు, బ్యాంకు ఖాతాలను విభజించే ప్రక్రియను వీలున్నంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థలు, సాంకేతిక విద్య, వైద్య విద్యలోని సీట్లకు ప్రస్తుతం అమలులో ఉన్న కోటాను పది సంవత్సరాల పాటు కచ్చితంగా అమలు చేయాలని రామచంద్రరావు బిల్లులో పొందుపరిచారు. రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు కాదు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆరోజు డిమాండ్ చేసిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఇప్పుడేం చేస్తున్నారని ఆయన నిలదీశారు. ఈ బిల్లుకు సంబంధించిన మంత్రులెవ్వరూ సభలో లేకపోవటం శోచనీయమని ఆయన విమర్శించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నఖ్వి బదులిస్తూ హోం శాఖ సహాయ మంత్రి సభలో ఉన్నారని బదులిచ్చారు.
బిల్లును సమర్థించిన ఆనంద భాస్కర్ మాట్లాడుతూ, రాష్ట్రం బాధను కేంద్రం ఎప్పుడు అర్థం చేసుకుంటుందని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు కొత్త రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆయన ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.