జాతీయ వార్తలు

ప్రత్యేక హోదాపై జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతికి ఏపి కాంగ్రెస్ వినతి కోటి సంతకాల పత్రం అందజేత

న్యూఢిల్లీ, మార్చి 14: పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఏపి కాంగ్రెస్ నాయకులు కోటి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి అందజేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలో ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచందర్‌రావు, టి సుబ్బరామిరెడ్డి, జెడి శీలం, జైరామ్ రమేష్, మాజీ మంత్రులు చిరంజీవి, పల్లంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిల్లికృపారాణి, కె బాపిరాజు, సి రామచంద్రయ్య తదితరులు సోమవారం మధ్యాహ్నం రాష్టప్రతి భవన్‌కువెళ్లి ప్రణబ్ ముఖర్జీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో దాదాపు మూడు వందల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ బృందంలోని పదిహేను మంది ప్రముఖులు సోమవారం రాష్టప్రతిని కలిశారు. ఈమేరకు కేంద్రంలోని ఎన్‌డిఏ ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని వారు ప్రణబ్ ముఖర్జీని కోరారు. రాష్ట్ర విభజనతో ఏపి ఎంతో కోల్పోయింది, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరమని వారు అన్నారు. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలు, విభజన చట్టంలోని హామీలు అమలు కావటం లేదని రఘువీరారెడ్డి రాష్టప్రతిని కలిసిన అనంతరం విలేఖరులతో చెప్పారు. విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా హామీలు అమలుకు నోచుకోలేదని ఆయన దుయ్యబట్టారు. యుపిఏ ప్రభుత్వం ఏపికి ఐదు సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయిస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన బిజెపి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత మరిచిపోయిందని రఘువీరారెడ్డి ఆరోపించారు. తమ విజ్ఞప్తికి రాష్టప్రతి సానుకూలంగా స్పందించారని ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని జాతీయ పార్టీల మద్దతు కోరనున్నట్లు రఘువీరారెడ్డి తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవటం అన్యాయమని టి సుబ్బరామిరెడ్డి చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ బృందం సోమవారం సాయంత్రం జెడియు అధినాయకుడు శరద్ యాదవ్, సిపిఐ నాయకుడు రాజాను కలిసి ప్రత్యేక హోదా సాధనకు తమకు సహాయం చేయాలని కోరారు. మంగళవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఏపి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రతిపక్షాలు లేవదీయనున్నాయి. (చిత్రం) సోమవారం ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు