క్రీడాభూమి

గాజీ స్పిన్ మాయాజాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఫ్గాన్‌పై బంగ్లాదేశ్ విజయం
కోల్‌కతా, నవంబర్ 22: ఎడమచేతి వాటం స్పిన్నర్ సలే అహ్మద్ షవోన్ గాజీ స్పిన్ మాయాజాలం అఫ్గానిస్థాన్‌పై బంగ్లాదేశ్‌కు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందించింది. అండర్-19 క్రికెట్ ట్రైసిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 30.4 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. హజ్రతుల్లా (32), ఇషానుల్లా (14) తప్ప ఎవరూ రెండంకెల స్కోర్లు చేయలేకపోయారు. గాజీ 7.4 ఓవర్లు బౌల్ చేసి, పది పరుగులకే ఆరు వికెట్లు కూల్చాడు. అతని స్పిన్‌ను ఎదుర్కోలేక అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 34.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 89 పరుగులు చేసి, నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. సైఫ్ హసన్ 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గాన్ బౌలర్లలో జియావుర్ రెహ్మాన్, కరీం జనత్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.