క్రీడాభూమి

గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), మే 16: ఐపిఎల్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌ను ఎదుర్కోవడానికి జహీర్ ఖాన్ నాయకత్వంలోని ఢిల్లీ డేర్‌డెవిల్స్ అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నది. 11 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలను నమోదు చేసి, ఐదు పరాజయాలను ఎదుర్కొన్న డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్‌కు చేరే అవకాశాలను మెరుగుపరచుకోవాలంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రైజింగ్ పుణెను ఓడించి తీరాలి. 12 మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు సాధించి, తొమ్మిది పరాజయాలను చవిచూసిన రైజింగ్ పుణె కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. అన్ని విభాగాల్లోనూ విఫలమవుతున్న రైజింగ్ పుణెపై విజయం అసాధ్యం కాదన్నది జహీర్ నమ్మకం. మాయాంక్ అగర్వాల్, కార్లొస్ బ్రాత్‌వెయిట్, నాథన్ కౌల్టర్ నైల్, క్వింటన్ డి కాక్, జీన్ పాల్ డుమినీ, క్రిస్ మోరిస్, రిషభ్ పంత్, సంజూ శాంసన్ వంటి మేటి ఆటగాళ్లతో డేర్‌డెవిల్స్ పటిష్టంగా ఉంది. జహీర్ స్వయంగా బౌలింగ్‌లో రాణిస్తూ సహచరులకు మార్గదర్శకం చేస్తున్నాడు. రైజింగ్ పుణె బ్యాటింగ్ ఆర్డర్‌ను అతను ఎంత త్వరగా దెబ్బతీస్తే డేర్‌డెవిల్స్‌కు గెలిచే మార్గం అంత సులభమవుతుంది. కాగా, రైజింగ్ పుణెలో ఆజింక్య రహానేను మినహాయిస్తే మిగతా వారు ఎవరూ తమ స్థాయికి తగినట్టు ఆడడం లేదు. కీలక క్రికెటర్లు గాయం కారణంగా వైదొలగడం రైజింగ్ పుణెను దారుణంగా దెబ్బతీసింది. దీనికితోడు నిలకడలేకుండా ఆడడం, సరైన వ్యూహరచన లేకపోవడం వంటి సమస్యలు కూడా ఆ జట్టును వేధిస్తున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ సేవలను ధోనీ సక్రమంగా వినియోగించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెతుతున్నాయి. అయితే, ధోనీ వాటిని పట్టించుకోవడం లేదు. ఏకపక్ష నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతో సహచరుల మద్దతును కూడా అతను కోల్పోతున్నాడు. అసాధారణంగా రాణించి, ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డితే తప్ప రైజింగ్ పుణెకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం సాధ్యం కాదు. అయితే, తమదైన రోజున ఎలాంటి అద్భుతాన్నయినా ఆవిష్కరించే సత్తా ఉన్న ఉస్మాన్ ఖాజా, జార్జి బెయిలీ, తిసర పెరెరా, రజత్ భాటియా, స్కాట్ బోలాండ్, ఇశాంత్ శర్మ తదితరులు విశాఖలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎసిఎ-విడిసిఎ మైదానంలో సంచలనం సృష్టించినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.