క్రీడాభూమి

ఎటిపి వరల్డ్ టూర్ ఫైనల్స్ సెమీస్‌లో జొకొవిచ్-నాదల్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, నవంబర్ 20: లండన్‌లో జరుగుతున్న ఎటిపి వరల్ డ టూర్ ఫైనల్స్‌లో సెర్బియాకు చెందిన ప్రపంచ నెంబర్ వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్‌తో పాటు స్విట్జర్లాండ్‌కు చెందిన మూడో సీడ్ ఆటగాడు రోజర్ ఫెదరర్, స్పెయన్ ‘బుల్’ రాఫెల్ నాదల్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నమెంట్‌లో ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన రాఫెల్ నాదల్ శుక్రవారం జరిగిన సింగిల్స్ రౌండ్ రాబిన్ పోరులో 6-7, 6-3, 6-4 సెట్ల తేడాతో స్పెయన్‌కే చెందిన ఏడో సీడ్ ఆటగాడు డేవిడ్ ఫెరర్‌పై గెలుపొంది సెమీస్‌లో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాడు. కాగా, అంతకుముందు జరిగిన మరో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ జొకొవిచ్ చెక్ రిపబ్లిక్‌కు చెందిన ఆరో సీడ్ ఆటగాడు థామస్ బెర్డిచ్‌పై వరుస సెట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో జొకొవిచ్ 6-3, 7-5 తేడాతో బెర్డిచ్‌ను మట్టికరిపించాడు. కాగా, ఎటిపి టూర్ ఫైనల్స్‌లో ఇంతకుముందు రికార్డు స్థాయిలో ఆరుసార్లు విజేతగా నిలిచిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ఈసారి రౌండ్ రాబిన్ పోరులో విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు కై నిషికోరితో జరిగిన ఈ పోరులో తొలి సెట్‌ను 7-5 తేడాతో గెలుచుకున్న ఫెదరర్‌కు ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఫలితంగా ఫెదరర్ 4-6 తేడాతో రెండో సెట్‌ను కోల్పోయినప్పటికీ నిర్ణాయక మూడో సెట్‌లో మళ్లీ తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించాడు. 6-4 తేడాతో ఆ సెట్‌ను కైవసం చేసుకుని మరో అడుగు ముందుకేశాడు.