జాతీయ వార్తలు

డిజిటల్ ప్రపంచంలోకి దూరదర్శన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: దూరదర్శన్, ఆకాశవాణిల ప్రసారాలు ఇక అన్ని రకాల డిజిటల్ వేదికలపై ప్రత్యక్షం కానున్నాయి. ప్రపంచ ప్రేక్షకులకు ఈ రెండింటి ప్రసారాలను అందుబాటులోకి తీసుకురావటానికి ప్రసారభారతి అన్ని సన్నాహాలు చేస్తోంది. అల్‌జజీరా, రష్యాటుడే, ఎన్‌పిఆర్ చానళ్ల మాదిరిగా దూరదర్శన్‌ను కూడా డిజిటల్ మాధ్యమం ద్వారా విశ్వ ప్రేక్షకులకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటానికి ప్రసారభారతి ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ప్రసారభారతి చైర్మన్ ఏ. సూర్యప్రకాశ్ ఏర్పాటు చేసిన కమిటీ జూన్ 16న తొలిసారి సమావేశమై చర్చలు జరిపింది. ప్రసారభారతి సభ్యులు, ఆన్‌లైన్ మీడియా కంపెనీ వ్యవస్థాపకుడు శశిశేఖర్ వెంపటి, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సునిల్ అలగ్, రాజీవ్ సింగ్, సీనియర్ జర్నలిస్టు ఆర్.జగన్నాథన్, విద్యావేత్త వంశీ జూలూరి, పారిశ్రామికవేత్త రితేశ్ బావ్రీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లతోపాటు సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్, జి+, యూట్యూబ్, వాట్సాప్, వైబర్‌ల ద్వారా దూరదర్శన్, ఆకాశవాణి ప్రసారాలను అందుబాటులోకి తీసుకువస్తారు.
ప్రపంచంలోని అన్ని సంఘటనలను భారతీయ దృక్కోణంలో విశ్వసమాజానికి అందిస్తారు. ఇంగ్లీష్‌లో మొదట ఈ ప్రసారాలు ప్రారంభమవుతాయి.
ఆ తరువాత స్పానిష్, ఫ్రెంచి తదితర ప్రధాన ప్రపంచ భాషల్లో కూడా ఈ ప్రసారాలు అయ్యేలా చర్యలు తీసుకుంటారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ప్రసారభారతి వర్గాలు వెల్లడించాయి.