క్రీడాభూమి

అఫ్రిదీపై ఒత్తిడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, జూన్ 27: తుంటి మీద కొడితే నోటి పళ్లు రాలాయని సామెత పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ విషయంలో నిజమైంది. అర్జెంటీనా సాకర్ హీరో లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడానికి, అఫ్రిదీ కెరీర్‌కు ఎలాంటి సంబంధం లేదు. మెస్సీ క్రికెటర్ కాడు. పాకిస్తానీ అంతకంటే కాడు. కానీ, మెస్సీ రిటైరయ్యాడన్న వార్త వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో ‘అఫ్రిదీ.. నీ రిటైర్మెంట్ ఎప్పుడు?’ అంటూ ప్రశ్నల వర్షం కురుస్తున్నది. కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనా ఓడినందుకు నైతిక బాధ్యత వహిస్తూ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించాడని, అలాంటిది ఈఏడాది జరిగిన టి-20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ నాకౌట్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించినప్పటికీ జట్టులో ఎలా కొనసాగుతున్నావంటూ అఫ్రిదీని నిలదీస్తున్నారు. ఈ అనుకోని విమర్శల దాడిని ఏ విధంగా ఎదుర్కోవాలో అర్థంగాక అఫ్రిదీ తలపట్టుకుంటున్నాడు.

చిత్రం షాహిద్ అఫ్రిదీ