క్రీడాభూమి

కెనడా ఓపెన్ బాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్గరీ (కెనడా), జూలై 2: భారత యువ ఆటగాడు అజయ్ జయరామ్ ఇక్కడ జరుగుతున్న కెనడా ఓపెన్ గ్రాండ్ ప్రీ పురుషుల సింగిల్స్‌లో సెమీ ఫైనల్స్ చేరాడు. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన అతను క్వార్టర్ ఫైనల్‌లో భారత్‌కే చెందిన హర్షీల్ డానీని 21-18, 19-21, 21-8 తేడాతో ఓడించాడు. కాగా, నాలుగో సీడ్ సాయి ప్రణీత్ కూడా సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్ ఫైనల్‌లో అతను రాల్ మస్ట్ (ఇస్టోనియా)పై 21-14, 21-16 తేడాతో కేవలం 33 నిమిషాల్లో, వరుస సెట్లలో విజయం సాధించాడు. హెచ్‌ఎస్ ప్రణయ్ పోరాటం క్వార్టర్ ఫైనల్స్‌తో ముగిసింది. చివరి వరకూ పోరాడిన అతను 22-20, 21-23, 18-21 తేడాతో బ్రిస్ లెవెడెజ్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మహిళల సింగిల్స్‌లో రుత్వికా శివానీ, తన్వీ లాడ్ ఓటమిపాలయ్యారు. రుత్వికను బల్గేరియా క్రీడాకారిణి లిండా జెచిరి 21-16, 21-12 తేడాతో ఓడించింది. తన్వీపై ఇరిస్ వాంగ్ 21-16, 21-15, 21-10 ఆధిక్యంతో గెలిచింది.