క్రీడాభూమి

యూరో 2016 సాకర్‌లో వేల్స్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిల్లే, జూలై 2: యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్‌లో వేల్స్ జట్టు సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా అనామక జట్టుగా బరిలోకి దిగిన వేల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో బెల్జియంపై 3-1 తేడాతో విజయం సాధించి, తొలిసారి ఒక మేజర్ టోర్నీ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. హాట్ ఫేవరిట్‌గా మ్యాచ్‌ని ఆరంభించిన బెల్జియం ఆరంభంలోనే తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చేతులెత్తేయగా, ఎదురుదాడికి దిగిన వేల్స్ అందరి అంచనాలను తారుమారు చేస్తూ విజయభేరి మోగించింది. మ్యాచ్ ఆరంభంలో ప్రత్యర్థిపై విరుచుకుపడిన బెల్జియం 13వ నిమిషంలోనే గోల్ సాధించింది. రజ్డా నైన్గోలన్ ఈ గోల్‌ను చేసి, బెల్జియంను ఆధిక్యంలో నిలిపాడు. ఒక గోల్ నమోదైన వెంటనే బెల్జియం రక్షణాత్మక విధానాన్ని అనుసరించి, వేల్స్‌ను గోల్స్ చేయకుండా అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఆడింది. అయితే, చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధమైన వేల్స్ దాడులకు ఉపక్రమించడంతో ఒక్కసారిగా పూర్తి డిఫెన్స్‌లోకి వెళ్లిపోయింది. ఆష్లే విలియమ్స్ 31వ నిమిషంలో ఈడ్వెలైజర్‌ను సాధించడంతో ఊపిరి పీల్చుకున్న వేల్స్ ప్రథమార్ధాన్ని 1-1గా ముగించింది. ద్వితీయార్ధంలో దాడులను కొనసాగించిన వేల్స్‌కు 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కనూ రెండో గోల్‌ను అందించాడు. 86వ నిమిషంలో సామ్ వోక్స్ చేసిన గోల్‌తో 3-1 ఆధిక్యానికి దూసుకెళ్లిన వేల్స్ అదే తేడాతో విజయం సాధించి, సెమీ ఫైనల్ చేరింది. అంతర్జాతీయ వేదికలపై ఒక మేజర్ టోర్నీలో వేల్స్ సెమీ ఫైనల్ వరకూ చేరడం ఇదే మొదటిసారి. ఇంగ్లాండ్ జట్టు నీడలో ఎప్పుడూ ద్వితీయ శ్రేణి జట్టుగా ఉన్న వేల్స్ చారిత్రక విజయంతో ఆ జట్టు అభిమానులు టోర్నీని సాధించినంత ఘనంగా సంబరాలు జరుపుకొంటున్నారు.

చిత్రం.. యూరో 2016 సాకర్ చాంపియన్‌షిప్ క్వార్టర్ ఫైనల్‌లో బెల్జియంను ఓడించిన వేల్స్ ఆటగాళ్ల ఆనందం