క్రీడాభూమి

ఎల్‌బి నిబంధనల్లో మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిన్‌బరో, జూలై 3: ఎల్‌బిడబ్ల్యు నిబంధనల్లో మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) పాలక మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, టెస్టు క్రికెట్‌లో తలపెట్టిన భారీ మార్పుల పట్ల మొగ్గుచూపలేదు. ప్రత్యేకించి టెస్ట క్రికెట్‌ను రెండు వేర్వేరు గ్రూపుల కింద ఆడాలన్న ప్రతిపాదనకు శశాంక్ మనోహర్ అధ్యక్షతన సమావేశమైన ఐసిసి పాలకమండలి అంగీకరించలేదు. ఇప్పటి వరకూ ఒక బౌలర్ ఎల్‌బి అప్పీల్ చేసినప్పుడు, బంతి ఆఫ్ లేదా మిడిల్ స్టంప్ జోన్‌పై పడాలన్న నిబంధన ఉండేది. అయితే, ఇప్పుడు మిడిల్, లెగ్ స్టంప్ జోన్‌పై బంతి పడితే బౌలర్ ఎల్‌బి అప్పీల్ చేయవచ్చని కొత్త నిబంధనను ప్రవేశపెట్టనున్నారు. ఈ మార్పు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఐసిసి ప్రకటించింది. అంపైర్ డిసిషన్ రివ్యూ సిస్టమ్ (డిఆర్‌ఎస్)ను అమలు చేసే టోర్నీలు ఏవైనా ఈలోగా జరిగితే, వాటిలో కొత్త నిబంధన అమలవుతుందని పేర్కొంది. కొత్త విధానం బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని, ఎక్కువ మంది బ్యాట్స్‌మెన్ అవుటవుతారని వివరించింది. ఒక బ్యాట్స్‌మన్ ఎల్‌బి అయ్యాడని బౌలర్ అప్పీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్ సులభంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుందని తెలిపింది.
నోబాల్స్ విషయంలోనూ ఐసిసి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకూ నోబాల్స్ విషయంలో ఫీల్డ్ అంపైర్లదే తుది నిర్ణయం. అయితే, ఇకపై డిఆర్‌ఎస్‌లో నోబాల్స్ నిర్ణయాన్ని కూడా చేరుస్తారు. థర్డ్ అంపైర్ వెంటనే రిప్లేలో పరిశీలించి, ఫీల్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయంపై తన అభిప్రాయాన్ని ప్రకటిస్తాడు. ఈ విధానాన్ని త్వరలో ఆరంభమయ్యే ఏదైనా వనే్డ సిరీస్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని, ఆతర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఐసిసి ఒక ప్రకటనలో తెలిపింది. టెస్టు, వనే్డ, టి-20 ఫార్మెట్స్‌లో మ్యాచ్‌లను మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దాలని నిర్ణయించినట్టు తెలిపింది. అయితే, టెస్టు క్రికెట్ రూపురేఖల్ని మార్చడానికి నిరాకరిస్తున్నట్టు ప్రకటించింది. టెస్టు హోదాగల దేశాల్లో మొదటి ఎనిమిది దేశాలను ఒక గ్రూపుగా, మిగతా రెండు దేశాలతోపాటు, ఐసిసి అనుబంధ సభ్య దేశాల్లో టాప్-6 దేశాలను కలిపి మరో గ్రూపుగా విభజించాలన్న ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీని వల్ల బలమైన జట్లతో మరీ బలహీనమైన జట్లు పోటీపడడం, ఏకపక్ష ఫలితాలు వెలువడడం వంటి సమస్యలకు తెరపడుతుందన్న వాదన వినిపిస్తున్నది. అయితే, రెండు గ్రూపులుగా విభజించి టెస్టు సిరీస్‌లను నిర్వహించేందుకు ఐసిసి నిరాకరించింది. టెస్టు క్రికెట్‌లో ఈ మార్పు ఆమోదయోగ్యం కాదని తెలిపింది.