క్రీడాభూమి

టెస్టుల్లో మా సత్తా త్వరలో తేలుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 4: టెస్టులకు తాము ఎంత వరకు సమాయత్తమయ్యామో, తమ సత్తా ఏమిటో త్వరలోనే తేలుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు రానున్న కొద్దికాలంలో ఏకంగా 17 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ముందుగా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లి, అక్కడ నాలుగు మ్యాచ్‌ల్లో పోటీపడుతుంది. టూర్‌కు వెళ్లే ముందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ, టెస్టు ఫార్మెట్‌కు తాము ఎంత వరకూ సిద్ధమయ్యామన్నది ఈ టెస్టు మ్యాచ్‌ల కాలం స్పష్టం చేస్తుందని అన్నాడు. చాలా తక్కువ కాలంలో పదిహేడు టెస్టులు ఆడే అవకాశం అరుదుగా లభిస్తుందని చెప్పాడు. చీఫ్ కోచ్‌గా కుంబ్లే నియామకంపై హర్షం వ్యక్తం చేశాడు. స్వదేశంలోనేగాక, విదేశాల్లోనూ పలు సందర్భాల్లో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న మాజీ ఆటగాడు కోచ్‌గా రావడం తమ అదృష్టమన్నాడు. ఆదివారం హఠాత్తుగా తమను వసుంధర దాస్ కార్యక్రమానికి తీసుకెళ్లడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పాడు. నిరంతరం మైదానంలో శ్రమించే తమకు ఇలాంటి ఆటవిడుపు అవసరమని అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యాడని, విండీస్ టూర్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై అతను కూడా కొన్ని సూచనలు చేశాడని కోహ్లీ అన్నాడు.
సాహాకే కీపింగ్ బాధ్యత
ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ వికెట్‌కీపర్‌గా వృద్ధిమాన్ సాహానే ఉంటాడని కోహ్లీ తేల్చిచెప్పాడు. ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా కీపింగ్ చేయగలడు కాబట్టి, అదనంగా మరో ఆటగాడిని తీసుకోవడానికి వీలుగా సాహాను పక్కకు పెడతారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదన్నాడు. రాహుల్‌పై ఓపెనర్‌గా దిగాల్సిన బాధ్యత ఉందన్నాడు. క్యాచ్‌లు సరిగ్గా పట్టుకోవాలన్నా, స్టంపింగ్ అవకాశాలు చేజారకుండా ఉండాలన్నా స్పెషలిస్టు కీపర్ అవసరమని చెప్పాడు. పార్ట్‌టైమర్లతో టెస్టులు ఆడలేమని అన్నాడు.
ర్యాంకింగ్‌పై ఆసక్తిలేదు
వెస్టిండీస్‌ను 4-0 తేడాతో ఓడిస్తే, టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ విషయాన్ని కోహ్లీ దృష్టికి తెచ్చి, నంబర్ వన్‌గా ఎదిగేందుకు ప్రయత్నిస్తారా అని ఓ విలేఖరి అడగ్గా, తనకు ఆర్యంకింగ్‌పై ఆసక్తిలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు గెలవడమే తమ లక్ష్యమని, తమ పని తాము చేసుకుంటూ పోతే, ర్యాంకులనేవి వాటంతట అవే వస్తాయని వ్యాఖ్యానించాడు. ఒకవేళ నంబర్ వన్‌గా ఎదిగినా, అది శాశ్వతం కాదని, సక్రమంగా ఆడపోతే మళ్లీ రెండో స్థానానికి పడిపోతామని చెప్పాడు. ర్యాంకింగ్ అనేది ఒక ప్రక్రియే తప్ప దాని గురించే మ్యాచ్‌లు ఆడడబోమని కోహ్లీ అన్నాడు. శిక్షణ శిబిరంలో చాలా కష్టపడ్డామని వాటి ఫలితాలు రానున్న సిరీస్‌లలో తెలుస్తాయని కోహ్లీ అన్నాడు.