క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు గాట్లిన్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూగేన్, జూలై 4: ఉసేన్ బోల్ట్ చిరకాల ప్రత్యర్థి జస్టిన్ గాట్లిన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదంచాడు. జమైకా క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అతను 100 మీటర్ల లక్ష్యాన్ని 9.8 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని సాధించాడు. ట్రైవాన్ బ్రోమెల్ 9.84 సెకన్లతో రెండో స్థానాన్ని ఆక్రమించగా, 9.98 సెకన్లలో గమ్యాన్ని చేరిన మార్విన్ బ్రాసీకి కాంస్య పతకం లభించింది. ఇలావుంటే, జమైకా తరఫున రియోలో పాల్గొనే అవకాశం బోల్ట్‌కు దక్కితే, అతనికి గాట్లిన్ నుంచి గట్టిపోటీ తప్పదు. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించిన కారణంగా గాట్లిన్ రెండు పర్యాయాలు సస్పెన్షన్‌కు గురయ్యాడు. నిషేధ కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. బోల్ట్‌కు గట్టిపోటీదారుడిగా పేరు తెచ్చుకున్నాడు. అతను రియోకు అర్హత సంపాదించడం సహజంగానే బోల్ట్‌కు సవాళ్లను విసురుతున్నది. తీవ్రమైన పోటీకి గాట్లిన్ కూడా సిద్ధంగా ఉన్నాడు.