క్రీడాభూమి

200 మీటర్ల పరుగులో రియోకు గాట్లిన్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగెన్ (అమెరికా), జూలై 10: అమెరికా రన్నర్ జస్టిన్ గాట్లిన్ పురుషుల 200 మీటర్ల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. యుఎస్ ఒలింపిక్ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన ఈ పోటీలో అతను లక్ష్యాన్ని 19.75 సెకెన్లలో పూర్తి చేసి, రియోలో గట్టిపోటీదారుడిని అవుతానని నిరూపించుకున్నాడు. అతనితో చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోటీపడిన లాష్వాన్ మెరి 19.79 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. అమీన్ వెబ్ 20 సెకన్లలో లక్ష్యాన్ని చేరి, మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్‌కు గట్టిపోటీనిచ్చే సామర్థ్యం ఉన్న గాట్లిన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడంతో, రియోలో పోటీపై ఇప్పటి నుంచే ఆసక్తి నెలకొంది.