క్రీడాభూమి

నవంబర్‌లో కబడ్డీ ప్రపంచ కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూలై 12: ఆరవ ఎడిషన్ ప్రపంచ కప్ కబడ్డీ (డబ్ల్యుసికె-2016) టోర్నమెంట్ నవంబర్ 3 నుంచి 17వ తేదీ వరకు రాష్ట్రంలోని 14 వేదికల్లో జరుగుతుందని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంగళవారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవం రూప్‌నగర్‌లోనూ, ముగింపు ఉత్సవం జలాలాబాద్ (్ఫజిల్కా)లోనూ జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్న సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పంజాబ్ కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు ప్రపంచ కప్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వాహక కమిటీతో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించి పక్షం రోజుల పాటు ఈ టోర్నీని నిర్వహించేందుకు అనుమతి తెలిపారు. మొత్తం 7 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో 14 దేశాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు పాల్గొంటాయని, పురుషుల విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు 2 కోట్ల రూపాయలు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు కోటి రూపాయలు, మహిళల విభాగంలో టైటిల్ విజేతగా నిలిచిన జట్టుకు కోటి రూపాయలు, రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 51 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేస్తామని ఆయన వివరించారు.
వివరాలను వెల్లడిస్తున్న
సుఖ్‌బీర్ సింగ్ బాదల్