క్రీడాభూమి

రామ్‌దిన్‌కు ఉద్వాసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెసెటెరి (సెయింట్ కిట్స్), జూలై 12: టీమిండియాతో త్వరలో జరుగనున్న నాలుగు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ సెలెక్టర్లు 12 మంది సభ్యులతో తమ జట్టును ఎంపిక చేశారు. సీనియర్ వికెట్‌కీపర్/బ్యాట్స్‌మన్ దినేష్ రామ్‌దిన్‌కు ఈ సిరీస్ నుంచి ఉద్వాసన పలికి అన్‌క్యాప్డ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రోస్టన్ చేస్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు కల్పించారు. ఆఫ్‌స్పిన్నర్‌గా బౌలింగ్ కూడా చేసే చేస్ ఇటీవల భారత జట్టుతో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడి కేవలం 3 పరుగులు సాధించాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 29 మ్యాచ్‌లు ఆడిన చేస్ 42.87 శాతం సగటుతో ఆరోగ్యకరమైన గణాంకాలను కలిగివున్నాడు.
అయితే గత 11 ఏళ్ల నుంచి వెస్టిండీస్ జట్టులో కొనసాగుతున్న రామ్‌దిన్ విషయానికొస్తే, ఇప్పటివరకూ 74 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతను బ్యాటింగ్‌లో అత్యంత పేలవంగా 25.87 సగటును నమోదు చేశాడు. భారత్‌తో జరిగే సిరీస్ నుంచి తనకు ఉద్వాసన పలకబోతున్నారని, సెలెక్షన్ కమిటీ చైర్మన్, మాజీ వికెట్‌కీపర్ కోట్నీ బ్రౌన్ ఈ విషయాన్ని ఇప్పటికే తనకు తెలియజేశాడని రామ్‌దిన్ గత వారమే ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలతో జరిగిన ముక్కోణ సిరీస్‌లో రామ్‌దిన్ సరిగా రాణించలేకపోవడం కూడా అతనిపై సెలెక్టర్లు వేటు వేయడానికి మరో కారణం. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో తలపడే విండీస్ జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ లియోన్ జాన్సన్‌కు మళ్లీ చోటు కల్పించిన సెలెక్టర్లు, గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగన టెస్టు సిరీస్‌లో సరిగా రాణించలేకపోయిన పేసర్ కెమర్ రోచ్‌కు మొండిచెయ్యి చూపించారు. అలాగే టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మరో ఫాస్ట్ బౌలర్ జెరోమ్ టేలర్ తమకు తెలియజేయడంతో అతడికి కూడా ఈ జట్టులో చోటు కల్పించలేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి) ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతను అందుబాటులోనే ఉంటాడని డబ్ల్యుఐసిబి తెలిపింది.
రామ్‌దిన్‌పై ఆంక్షలు
ఇదిలావుంటే, టీమిండియాతో టెస్టు సిరీస్ నుంచి తనకు ఉద్వాసన పలకబోతున్నారంటూ గత వారం ట్విట్టర్ ద్వారా అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ కెప్టెన్ దినేష్ రామ్‌దిన్‌పై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆంక్షలు విధించింది. రామ్‌దిన్ చర్యలు బోర్డు అనుసరిస్తున్న విధానానికి విరుద్ధంగా ఉన్నాయని, అందుకే అతడిని శిక్షించాలని నిర్ణయించామని డబ్ల్యుఐసిబి వెల్లడించింది. అయితే రామ్‌దిన్‌పై విధించిన ఆంక్షల తీరు ఏమిటన్నదీ విండీస్ క్రికెట్ బోర్డు తెలియజేయలేదు.
విండీస్ జట్టు ఇదే
జాసన్ హోల్డర్ (కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (వైస్-కెప్టెన్), దేవేంద్ర బిషూ, జెర్మయిన్ బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావో, రాజేంద్ర చంద్రిక, రోస్టన్ చేస్, షేన్ డౌరిచ్ (వికెట్‌కీపర్), షానన్ గాబ్రియెల్, లియోన్ జాన్సన్, మర్లాన్ శామ్యూల్స్.

వేటును ముందే వెల్లడించిన రామ్‌దిన్