క్రీడాభూమి

‘రాకెట్ రాణి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: మహిళలను మనం ఎంతగా ప్రేమిస్తామో, గౌరవిస్తామో అంత గొప్ప విజయాలను దేశం సాధిస్తుందని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ అన్నాడు. ఈ ప్రపంచంలో మహిళలకన్నా గొప్ప విజయాలు సాదించిన వారు మరెవరూ లేరని కూ ఆయన అన్నాడు. ఏస్ అగైనెస్ట్ ఆడ్స్’ పేరుతో టెన్నిస్ తార సానియా మీర్జా రాసిన ఆత్మకథ పుస్తకాన్ని షారుఖ్ ఖాన్ బుధవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సానియాను ‘రాణి ఆఫ్ రాకెట్’గా అభివర్ణించాడు. సానియా సాధించిన విజయాలు మన దేశం గర్వించేలా చేశాయన్నాడు. ఈ దేశంలో బాల బాలికలు క్రీడలను ఒక వృత్తిగా చేపట్టడానికి మార్గదర్శకులుగా నిలిచిన పిటి ఉష, సానియా మీర్జా, మేరీ కోమ్‌లాంటి క్రీడాకారిణులను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నాడు. కాగా, తన పుస్తకావిష్కరణకు షారుకే తగిన వ్యక్తని తాను భావించానని ఈ సందర్భంగా సానియా వ్యాఖ్యానించింది. దేవుడి దయవల్ల తాను సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉన్నందుకు సంతోషిస్తున్నానని కూడా ఆమె చెప్పింది.
chitram...
టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న షారుఖ్ ఖాన్