క్రీడాభూమి

ధోనీకి రూ.20 కోట్లు ఎగ్గొట్టిన ‘స్పార్టాన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: టెస్టు క్రికెట్ నుంచి చాలా కాలం క్రితమే రిటైర్ అయినప్పటికీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టుకు సారథిగా కొనసాగుతూ వాణిజ్య ప్రకటనల (ఎండార్స్‌మెంట్ల) రంగంలో ప్రత్యేక స్థానాన్ని కలిగివున్న మహేంద్ర సింగ్ ధోనీని అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న ‘స్పార్టాన్ స్పోర్ట్స్’ సంస్థ రూ.20 కోట్లకు పైగా సగించింది. క్రీడా దుస్తులు, ఉపకరణాలను తయారుచేసే ఆస్ట్రేలియాకు చెందిన ఈ సంస్థ ధోనీతో మూడేళ్లకు రూ.13 కోట్లతో బ్యాట్, స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకుని చాలా కాలం నుంచి చెల్లింపులు జరపడం లేదని, రాయల్టీలు, ఇతర రుసుములు కలిపి ఈ సంస్థ ధోనీకి రూ.20 కోట్లకు పైగా ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. కునాల్ శర్మ యజమానిగా ఉన్న ఈ సంస్థ 2013లో ధోనీతో ఒప్పందం కుదిరిన తర్వాత కేవలం నాలుగు కిస్తీలను మాత్రమే చెల్లించిందని, వీటిలో చివరి కిస్తీని ఈ ఏడాది మార్చిలో చెల్లించారని రితీ స్పోర్ట్స్ (్ధనీ మేనేజ్‌మెంట్ కంపెనీ)కు న్యాయ సేవలందిస్తున్న అధికారులు పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈ ఒప్పందం సజావుగా సాగడం లేదని, అయితే త్వరలోనే సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నామని రితీ స్పోర్ట్ యజమాని అరుణ్ పాండే చెప్పాడు. అయితే స్పార్టాన్ సంస్థతో ఒప్పందం ఒప్పందం సరిగా అమలు జరగకపోవడానికి కారణమేమిటన్నదీ అతను వెల్లడించలేదు. ఈ విషయమై స్పార్టాన్ యజమాని కునాల్ శర్మ నుంచి వివరణ పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన స్పందించలేదు. స్పార్టాన్ సంస్థకు ధోనీతో పాటు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్, వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, ఇంగ్లాండ్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ పేస్ బౌలర్ మిచెల్ జాన్సన్, వెస్టిండీస్ క్రికెట్ లెజెండ్ సర్ వివ్ రిచర్డ్స్ వంటి పలువురు క్రికెట్ ప్రముఖులు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీతో పాటు న్యూఢిల్లీలో కూడా స్టోర్‌ను కలిగివున్న స్పార్టాన్‌తో ధోనీ కుదుర్చుకున్న ఒప్పందం సాంకేతికంగా ఇప్పటికీ అమలులో ఉండటంతో ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు చేపట్టాలని రితీ స్పోర్ట్స్ భావిస్తోంది.
ఎండార్స్‌మెంట్ల మార్కెట్‌లోకి ప్రవేశించిన క్రికెటర్లందరి కంటే భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ రూ.100 కోట్ల బ్రాండ్ విలువను కలిగివున్న ధోనీకి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో చెన్నై జట్టుకు, హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్) టోర్నమెంట్‌లో రాంచీ రేస్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం 15 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.