క్రీడాభూమి

తొలి టెస్టులో పాక్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 17: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో పాకిస్తాన్ బోణీ చేసింది. లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో పాక్ ఆదివారం 75 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. 8 వికెట్ల నష్టానికి 214 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ మరో పరుగుకే ఆలౌటైంది. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టును పాక్ బౌలర్లు సమర్ధవంతంగా ప్రతిఘటించారు. ప్రత్యేకించి యాసిర్ షా (4/69), రహత్ అలీ (3/47) చక్కగా రాణించారు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన ఇంగ్లాండ్ జట్టు 207 పరుగులకే ఆలౌటై 75 పరుగులతో పరాజయాన్ని మూటగట్టుకుంది.