క్రీడాభూమి

ప్రపంచ కప్ టి-20 మ్యాచ్‌లకూ గండి కొడతారేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఢిల్లీ ప్రభుత్వానికి తమకు మధ్య కొనసాగుతున్న గొడవ కారణంగా అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ప్రపంచ టి-20 మ్యాచ్‌లను నిర్వహించడానికి తమను అనుమతించకపోవచ్చన్న అనుమానాన్ని ఢిల్లీ క్రికెట్ సంఘం (డిడిసిఏ) వ్యక్తం చేసింది.ప్రపంచ కప్ టి-20 టోర్నమెంటులో భాగంగా కోట్లా మైదానంలో పురుషుల విభాగంలో నాలుగు మ్యాచ్‌లకు, మహిళల విభాగంలో నాలుగు మ్యాచ్‌లు జరగాలి. అయితే ఫైర్ సేఫ్టీ, విద్యుత్ సమస్యలు లాంటి అంశాలపై రాష్ట్రప్రభుత్వం క్లియరెన్స్‌లు ఇవ్వడంలో సమస్యలు సృష్టించవచ్చని డిడిసిఏ అనుమానిస్తోందని హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనం పేర్కొంది. వినోదం పన్ను అంశం కూడా సమస్య కావచ్చని, మరోసారి హైకోర్టు తలుపులు తట్టాల్సి వస్తుందేమోనని డిడిసిఏ భావిస్తోందని ఆ కథనం పేర్కొంది. ‘ఫైర్ సేఫ్టీ, విద్యుత్, వినోదం పన్నుకు సంబంధించి డిడిసిఏకు క్లియరెన్స్‌లు ఇవ్వకపోవచ్చని ఢిల్లీ ప్రభుత్వంలోని ఓ అధికారి ద్వారా మాకు తెలిసింది. ఇవన్నీ కూడా రాష్ట్రప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశాలు కాబట్టి ఆప్ ప్రభుత్వం మరోసారి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. ఇంతకుముందు ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో భారత్-దక్షిణాఫ్రికా టెస్టు సమయంలో కూడా వాళ్లు ఇదే విధమైన ట్రిక్కులు ప్లే చేసారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు కూడా రావచ్చని మేము భయపడుతున్నాం. పరిస్థితి గనుక శ్రుతి మించితే అప్పుడు చేసినట్లుగా కోర్టు సాయం కోరుతాం. రిటైర్డ్ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ పరిశీలకుడిగా ఉన్నారు. అవసరమైతే మేము సాయం కోసం మరోసారి ఆయన వద్దకు వెళ్తాం’ అని డిడిసిఏ కోశాధికారి రవిందర్ మన్‌చందా ‘హిందుస్థాన్ టైమ్స్’కు చెప్పారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇటీవల జరిగిన చివరి టెస్టు సమయంలో కూడా ఇలాంటి సమస్యలే తలెత్తాయి. అయితే హైకోర్టు జోక్యం చేసుకుని జస్టిస్ ముద్గల్‌ను టెస్టు కోసం పరిశీలకుడిగా నియమించడంతో టెస్టు మ్యాచ్ కొనసాగింది.