క్రీడాభూమి

‘గ్రేట్ ఇండియా రన్’ ప్రారభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: దేశంలో తొలిసారి వివిధ నగరాల మీదుగా నిర్వహిస్తున్న మల్టీ సిటీ మారథాన్ ‘గ్రేట్ ఇండియా రన్’ ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి (ఇండియా గేట్) వద్ద కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్, ‘ఖేల్ రత్న’ అవార్డు గ్రహీత అంజూ బాబీ జార్జ్ ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ఈ మారథాన్‌ను ప్రారంభించారు. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలకు చెందిన 15 మంది మేటి అథ్లెట్లు ఈ మారథాన్‌లో పాల్గొంటున్నారు. వీరి వామప్ సెషన్‌తో ఈ ఈవెంట్ ప్రారంభమైంది. దీనితో పాటు 5కె ఫన్ రన్‌ను కూడా ప్రారంభించారు. ఇండియా గేట్ వద్ద నుంచి ‘గ్రేట్ ఇండియా రన్’లో పాల్గొంటున్న 14 మంది అల్ట్రా రన్నర్ల జట్టుకు అంతర్జాతీయ చాంపియన్ అరుణ్ భరద్వాజ్ సారథ్యం వహించాడు. ఇదే సమయంలో మరో ముగ్గురు రన్నర్లు ఘజియాబాద్ నుంచి కూడా ఈ రన్‌ను ప్రారంభించారు. మొత్తం 1,480 కిలోమీటర్ల దూరం పాటు సాగే ఈ మారథాన్‌లో పాల్గొంటున్న వారంతా గుర్గావ్‌లోని ‘కింగ్‌డమ్ ఆఫ్ డ్రీమ్స్’ వద్దకు చేరుకుని హర్యానా లెగ్ రన్‌ను ప్రారంభించారు. అలాగే ఈ రెండు ప్రాంతాల్లో నిర్వహించిన 5కె ఫన్ రన్‌లో పలువురు యువజనులు పాల్గొన్నారు. ఆసియాలోనే అత్యంత ఛాలెంజింగ్ మారథాన్‌గా పరిగణిస్తున్న ‘గ్రేట్ ఇండియా రన్’ ఇటు సామాన్యులతో పాటు అనుభవజ్ఞులైన రన్నర్ల సామర్ధ్యానికి సైతం పరీక్షగా నిలువనుంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ మీదుగా సాగే ‘గ్రేట్ ఇండియా రన్’ ఆగస్టు 6వ తేదీన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ముగుస్తుంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ రన్‌ను నిర్వహిస్తున్నారు.

‘గ్రేట్ ఇండియా రన్’లో పాల్గొంటున్న మేటి అథ్లెట్లు