క్రీడాభూమి

పవార్, శ్రీనివాసన్‌లకు మూసుకున్న ద్వారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ బోర్డులో ఆఫీసు బేరర్లుగా పనిచేసే వారికి వయో పరిమితి విధించాలని, 70 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు ఈ పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలని జస్టిస్ ఆర్‌ఎం.లోధా కమిటీ చేసిన పలు ప్రధాన సిఫారసులను ఆమోదిస్తూ సుప్రీం కోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుతో మరాఠా మాంత్రికుడు శరద్ పవార్‌తో పాటు ఎన్.శ్రీనివాసన్, నిరంజన్‌షా లాంటి పలువురు కురువృద్ధులకు బిసిసిఐలో ద్వారాలు మూసుకుపోనున్నాయి. గతంలో బిసిసిఐ అధ్యక్షులుగా వ్యవహరించిన శరద్ పవార్ ఇప్పుడు 75వ పడిలోనూ, శ్రీనివాసన్ 71వ పడిలోనూ ఉండటంతో ముంబయి, తమిళనాడు క్రికెట్ సంఘాల్లో వీరి అధ్యక్ష పదవులకు గండం వచ్చిపడింది. అలాగే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ (హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్)తో పాటు కార్యదర్శి అజయ్ షిర్కే (మహారాష్ట్ర), కోశాధికారి అనిరుధ్ చౌదరి (హర్యానా), సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరి (జార్ఖండ్) తమతమ రాష్ట్ర సంఘాల్లో పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను ఆరు నెలల్లోగా అమలు చేయాలని బిసిసిఐకి సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.