క్రీడాభూమి

ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘానికి గడ్డుకాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, జూలై 19: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)ను ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన ప్రధాన సిఫారసులన్నింటినీ సుప్రీం కోర్టు ఆమోదించడంతో ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం (యుపిసిఎ) తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కోనుంది. యుపిసిఎ కోశాధికారితో పాటు మొత్తం ఐదుగురు డైరెక్టర్లు 70 ఏళ్ల వయసు పైబడినవారే కావడంతో వీరంతా పదవీ గండంలో చిక్కుకున్నారు. కోశాధికారి కెఎన్.టాండన్ ప్రస్తుతం 80వ పడిలో ఉన్నారని, అలాగే డైరెక్టర్లు షువాయిబ్ అహ్మద్ (78), ప్రేమ్‌ధర్ పాథక్ (83), మదన్ మోహన్ (83), సతీష్ కుమార్ అగర్వాల్ (79), జ్యోతి బాజ్‌పాయ్ (80) వయసు కూడా 70 ఏళ్లు దాటడంతో వీరంతా తమతమ పదవుల నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బిసిసిఐలో మంత్రులు, ప్రభుత్వాధికారులకు చోటివ్వరాదని, ఆఫీసు బేరర్లకు వయో పరిమితి విధించి 70 ఏళ్ల వయసు పైబడిన వారు క్రికెట్ పాలకమండళ్లలో సభ్యత్వాన్ని పొందకుండా నిషేధం విధించాలని జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసును సుప్రీం కోర్టు సోమవారం ఆమోదించిన విషయం తెలిసిందే. దీనితో పాటు బోర్డులో పరస్పర ప్రయోజనాలకు తావులేకుండా చూసేందుకు ఏ వ్యక్తి అయినా ఒక పదవిలో మాత్రమే ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో యుపిసిఎ ప్రధాన కార్యనిర్వహణాధికారి (సిఇఓ) దీపక్ శర్మతో పాటు సీనియర్ సెలెక్షన్ కమిటీ సభ్యుడు జ్ఞానేంద్ర పాండే పదవులకు కూడా గండం ఏర్పడింది. దీపక్ శర్మ కుమారుడు అండర్-19 క్రికెట్ జట్టులో ఆడుతుండటంతో అతను పదవి నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజీవ్ శుక్లాకి కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం అతను ఐపిఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) చైర్మన్ పదవితో పాటు యుపిసిఎ కార్యదర్శి పదవిని కూడా అనుభవిస్తుండటమే ఇందుకు కారణం. అయితే ఐపిఎల్ చైర్మన్ పదవి ప్రత్యక్షంగా బిసిసిఐ ఆధ్వర్యంలో లేదని, కనుక రాజీవ్ శుక్లా జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల పరిధిలోకి రారని యుపిసిఎ అధికారులు చెబుతున్నారు.
మాజీ రంజీ క్రికెటర్ల హర్షం
ఇదిలావుంటే, సుప్రీం కోర్టు తీర్పు వలన యుపిసిఎలో మాజీ రంజీ క్రికెటర్లకు చోటు లభించనుంది. దీంతో వారంతా ఈ తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. జీవితంలో ఎన్నడూ కనీసం క్రికెట్ బ్యాట్‌ను కూడా పట్టుకోని వారు ఇప్పటివరకూ యుపిసిఎని ఏలుతూ ఉండటంతో వారి నిర్ణయాలను ఆటగాళ్లు బలవంతంగా అంగీకరించాల్సి వస్తోందని, అయితే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జస్టిస్ లోధా కమిటీ సిఫారసులు అమలైతే తమకు యుపిసిఎలో భాగస్వాములయ్యే అవకాశం లభిస్తుందని వారు చెబుతున్నారు.