క్రీడాభూమి

ఇక అసలు పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంటిగ్వా, జూలై 20: కరీబియన్ దీవుల్లో పర్యటిస్తున్న టీమిండియా ఇక అసలు సిసలైన పోరాటాన్ని ఆరంభించనుంది. వెస్టిండీస్‌తో నాలుగు టెస్టుల సిరీస్‌కు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ సిరీస్‌లో తొలి టెస్టు గురువారం ఆంటిగ్వాలో ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది. ఈ సిరీస్‌లో అంతగా అనుభవం లేని కరీబియన్లను వారి సొంత గడ్డపైనే ఓడించి రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి విజయభేరి మోగించాలని ఎదురు చూస్తున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు పూర్తివిశ్వాసంతో పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. కొత్త కోచ్ అనిల్ కుంబ్లే మార్గదర్శకత్వంలో తొలిసారి బరిలోకి దిగుతున్న కోహ్లీసేన ఈ టెస్టు ద్వారా భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఉవ్విళ్లూరుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో లెజెండరీ లెగ్ స్పిన్నర్‌గా ఖ్యాతిని గడించడంతో పాటు గతంలో టీమిండియాకు సారథిగా కూడా సేవలందించిన అనిల్ కుంబ్లే మూడు వారాల క్రితం భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతను క్షణం తీరిక లేకుండా భారత ఆటగాళ్లకు విస్తృత స్థాయిలో శిబిరాన్ని నిర్వహించి వారిని సన్నద్ధం చేయడంతో పాటు గత వారం సెయింట్ కిట్స్‌లో కోహ్లీసేన ఆడిన రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లను స్వయంగా దగ్గరుండి మరీ పర్యవేక్షించాడు. అంతేకాకుండా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో సరికొత్త అనుబంధానికి శ్రీకారం చుట్టడంతో పాటు వివిధ గ్రూప్ యాక్టివిటీలతో ఆటగాళ్ల ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి జట్టుపై కుంబ్లే తనదైన ముద్ర వేసుకున్నాడు. దీంతో భారత ఆటగాళ్లు పూర్తిగా ఫీల్డ్‌పై దృష్టి కేంద్రీకరించి కుంబ్లే నిర్ధేశించిన ప్రణాళికలను విజయవంతగా అమలు చేసేందుకు ఉద్యుక్తులవడంతో ఈ సానుకూలతలను ఆసరాగా చేసుకుని కరీబియన్ దీవుల్లో టిమిండియాకు హ్యాట్రిక్ అందించాలని కెప్టెన్ కోహ్లీ తహతహలాడుతున్నాడు. కరీబియన్ దీవుల్లో ఇంతకుముందు భారత జట్టు 2007లో ‘మిస్టర్ వాల్’ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలోనూ, ఆ తర్వాత 2011లో ‘కెప్టెన్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోనూ వరుసగా టెస్టు సిరీస్‌లు గెలిచిన విషయం తెలిసిందే.
టెస్టు జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతేడాది శ్రీలంకలో జరిగిన సిరీస్‌లో 2-1 తేడాతోనూ, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడిన సిరీస్‌లో 3-0 తేడాతోనూ భారత్‌కు విజయాలను అందించిన కోహ్లీ ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌ను కూడా కైవసం చేసుకుని కెప్టెన్‌గా హ్యాట్రిక్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే ఈ సిరీస్ కోసం కరీబియన్ దీవుల్లో ఏర్పాటు చేసిన స్లో పిచ్‌లు కోహ్లీసేన సామర్ధ్యానికి పరీక్షగా నిలువనున్నాయి. సెయింట్ కిట్స్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఏర్పాటు చేసిన పిచ్‌లపై ఆరంభంలో బంతి బాగానే బౌన్స్ అయినప్పటికీ ఆ తర్వాత అవి స్పిన్నర్లకు అనువుగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియాతో నాలుగు టెస్టులు జరిగే వేదికల్లోనూ కరీబియన్లు ఇదేవిధమైన పిచ్‌లను ఏర్పాటు చేయవచ్చని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.
ఇశాంత్‌కు జోడీ ఎవరో?
ఇదిలావుంటే, గురువారం విండీస్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టులో భారత పేస్ బౌలింగ్ విభాగ సారథి ఇశాంత్ శర్మకు భాగస్వామిగా వ్యవహరించేది ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. ఇశాంత్‌కు తోడుగా ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించిన మహమ్మద్ షమీ బరిలోకి దిగుతాడా? లేక గతేడాది శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లపై రాణించిన ఉమేష్ యాదవ్ బరిలోకి దిగుతాడా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏదిఏమైనప్పటికీ గురువారం విండీస్‌తో తలపడే భారత జట్టులో ఐదుగురు బౌలర్లకు చోటు కల్పించడం ఖాయమని స్పష్టమవుతుండటంతో ముంబయి బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఇంతకుముందు ప్రాక్టీస్ మ్యాచ్ మాదిరిగానే తొలి టెస్టులో కూడా పెవిలియన్‌కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.