క్రీడాభూమి

షాహిద్ కుటుంబాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: క్రీడా రంగంలో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన హాకీ లెజెండ్ మహమ్మద్ షాహిద్ మరణంతో విషాదంలో మునిగిపోయిన ఆయన కుటుంబానికి సాధ్యమైనంత సాయం అందించాలని పార్లమెంట్‌లో గురువారం పలువురు సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, బిజూ జనతాదళ్ (బిజెడి) సభ్యుడు దిలీప్ టిర్కే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, అద్భుతమైన నైపుణ్యంతో విశిష్టమైన ఆటగాడిగా ఖ్యాతి పొందిన షాహిద్ ఎంతో మంది హాకీ క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని, దేశ క్రీడా రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడాడు. అయితే క్రికెట్ మినహా ఇతర క్రీడల్లో సత్తా చాటుకున్న ప్రముఖులను మనం విస్మరిస్తున్నామని ఆయన విచారాన్ని వ్యక్తం చేస్తూ, షాహిద్ కుటుంబానికి సాధ్యమైనంత సాయాన్ని అందజేసి వారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాలకు అతీతంగా అధికార, విపక్షాలకు చెందిన పలువురు సభ్యులు టిర్కే అభిప్రాయంతో ఏకీభవించారు. దీంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యుటీ స్పీకర్ పిజె.కురియన్ మాట్లాడుతూ, టిర్కే వెలిబుచ్చిన అభిప్రాయంతో యావత్తు సభ అంతా అంగీకరిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఇదిలావుంటే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి ముద్దుబిడ్డగా పేరు పొందిన షాహిద్‌ను గౌరవించేందుకు స్మారకాన్ని ఏర్పాటు చేయాలని ఒక సభ్యుడు సూచించగా, షాహిద్‌కు సభలో నివాళులర్పించాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవ్రత్ చతుర్వేది సహా పలువురు సభ్యులు సభాపతిని కోరారు. దీనిపై కురియన్ స్పందిస్తూ, సాధారణంగా సభాధ్యక్షుడు సంతాప ప్రకటనలు చేయడం ఆనవాయితీగా వస్తోందని, కనుక సభ్యులు చేసిన సూచనను హమీద్ అన్సారీకి తెలియజేస్తానని చెప్పారు. ఒలింపిక్ క్రీడల్లో పసిడి పతకాన్ని సాధించిన షాహిద్ (56) బుధవారం గుర్గావ్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే.
కన్నీటి వీడ్కోలు
కాగా, వారణాసిలో గురువారం షాహిద్ భౌతికకాయానికి వేలాది మంది అభిమానుల సమక్షంలో ఘనంగా అంత్యక్రియలు జరిగాయ. షాహిద్ ఆప్త మిత్రుడు జఫర్ ఇక్బాల్‌తో పాటు ఒలింపియన్లు అశోక్ కుమార్, సుజిత్ కుమార్, ఆర్‌పి.సింగ్, షకీల్ అహ్మద్, సర్దార్ సింగ్ తదితరులు షాహిద్ అంతిమయాత్రలో పాల్గొని ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు.

చిత్రం..వారణాసిలో గురువారం షాహిద్‌కు కన్నీటి వీడ్కోలు పలుకుతున్న అభిమానులు