క్రీడాభూమి

రియోలో రాణిస్తా సానియా ఆశాభావం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: బ్రెజిల్‌లో వచ్చే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఒలింపిక్ క్రీడల్లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానని, సహచర భారత అథ్లెట్లతో కలసి ఈ క్రీడల్లో చక్కటి ప్రదర్శనతో రాణించగలనని ఆశిస్తున్నానని టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా స్పష్టం చేసింది. ‘ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు ఆసక్తితో ఎదురు చూస్తున్నా. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శనివారం హైదరాబాద్ నుంచి కెనడాకు బయలుదేరుతున్నా. ఈసారి భారత్ నుంచి అతిపెద్ద క్రీడా బృందం ఒలింపిక్స్‌కు వెళుండటం ఆసక్తిని కలిగిస్తోంది. మేమంతా ఈ క్రీడల్లో చక్కగా రాణించగలమని ఆశిస్తున్నా’ అని సానియా శుక్రవారం హైదరాబాద్‌లో ఒక ఫ్యాషన్ షో సందర్భంగా విలేఖర్లకు తెలిపింది. రియో ఒలింపిక్ క్రీడల్లో ఆమె మహిళల డబుల్స్ విభాగంలో యువ క్రీడాకారిణి ప్రార్థనా తోంబ్రేతోనూ, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బొపన్నతోనూ కలసి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.