క్రీడాభూమి

లియాండర్ లక్ష్యం.. ఒలింపిక్స్‌లో రెండో పతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 22: ఒలింపిక్స్‌లో రెండో పతకం సాధించడంతో పాటు భారత్ తరఫున డేవిస్ కప్‌లో అత్యధిక సింగిల్స్ విజయాలు సాధించిన రామనాథన్ కృష్ణన్ రికార్డును బద్దలు కొట్టాలన్నది లియాండర్ పేస్ లక్ష్యమట. వచ్చే నెల జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆడడం ద్వారా ఏడవసారి ఒలింపిక్స్‌లో పాల్గొనే రికార్డు కోసం పేస్ ఇప్పుడు సంసిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ‘పేస్‌కు కొన్ని లక్ష్యాలున్నాయి. ఒలింపిక్స్‌లో రెండో డబుల్స్ పతకం సాధించాలన్నది వాటిలో ఒకటి. ప్రపంచ డబుల్స్ చాంపియన్‌షిప్స్‌ను సాధించడం, రామనాతన్ కృష్ణన్ సాధించిన అత్యధిక (50) డేవిస్‌కప్ సింగిల్స్ విజయాల రికార్డును అధిగమించడం మిగతా రెండు లక్ష్యాలు’ అని లియాండర్ తండ్రి డాక్టర్ వేస్ పేస్ పిటిఐ చెప్పాడు. అయితే లియాండర్ చాలాకాలంగా సింగిల్స్ ఆడడం లేదుకదా అని అడగ్గా, అవును అతను సింగిల్స్ ఆడడం మానేసి చాలా కాలమే అయిందని ఆయన అన్నారు. అయితే పేస్ రికార్డుల మనిషి అని అంటూ, చండీగఢ్‌లో ఇటీవల జరిగిన డేవిస్ కప్ పోటీలలోనే సింగిల్స్ ఆడాలని అనుకున్నాడని, అయితే ఒలింపిక్స్‌పై దృష్టిపెట్టడం కోసం సింగిల్స్‌నుంచి తప్పుకొన్నాడని ఆయన చెప్పారు. అయితే మళ్లీ సింగిల్స్ ఆడతానని అతను అనుకుంటున్నాడని, కృష్ణన్ రికార్డుకు రెండు విజయాల చేరవలోనే ఉన్నాడని వేస్ చెప్పాడు. వేస్ డేవిస్ కప్‌లో సాధించిన మొత్తం 90 విజయాల్లో 48 సింగిల్స్ విజయాలు, 42 డబుల్స్ విజయాలున్నాయి. కాగా, రామనాథన్ కృష్ణన్ 50 సింగిల్స్ విజయాలు, 17 డబుల్స్ విజయాలు సాధించాడు. 2004లో ఏథెన్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనే లియాండర్ భూపతితో కలిసి డబుల్స్‌లో రెండో ఒలింపిక్స్ పతకం సాధించడానికి దాదాపు చేరువగా వచ్చాడు. అయితే సెమీ ఫైనల్‌లో దాదాపు నాలుగు గంటల పాటు పోరాడిన అనంతరం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్, ఇవాన్ జుబిసిక్ చేతిలో ఓటమి పాలవడంతో అది కలగా మిగిలి పోయింది. అయితే అప్పటినుంచి లియాండర్ ఎంతో పరిణతి చెందాడని, ఇప్పుడతనిలో ఇంతకు ముందున్న దూకుడు లేదని వేస్ అంటూ, అందువల్ల రియో ఒలింపిక్స్‌లో అతని లక్ష్యం నెరవేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు.