క్రీడాభూమి

కుట్ర గురించి తెలియదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 25: డోపింగ్ కుంభకోణంలో చిక్కుకున్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు లేనట్లేనని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ వెల్లడించారు. అయితే ఈ వ్యవహారంలో నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు వీలుగా నర్సింగ్‌కు సముచిత అవకాశాన్ని కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే నర్సింగ్ డోప్ కేసులో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించడం జరుగుతుందని, ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామని విజయ్ గోయల్ సోమవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో తేల్చి చెప్పారు. నర్సింగ్ యాదవ్ ఇప్పటికీ రియో ఒలింపిక్స్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అని విలేఖర్లు ప్రశ్నించగా, ‘నర్సింగ్ డోపింగ్‌కు పాల్పడినట్లు ఎ, బి శాంపిళ్ల పరీక్షల్లో వెల్లడవడంతో ప్రస్తుతం అతనిపై ప్రాథమిక సస్పెన్షన్ విధించాం. కనుక ప్రస్తుతం ఒలింపిక్స్‌కు వెళ్లే మన క్రీడాకారులు 119 మందే. రియోలో వారే మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు’ అని గోయల్ చెప్పారు. డోపింగ్ కుంభకోణంలో తనను ఇరికించేందుకు పెద్ద కుట్ర జరిగిందని నర్సింగ్ చేసిన ఆరోపణపై ప్రతిస్పందించాల్సిందిగా కోరగా, అతను ఆ విషయాన్ని తమతో చెప్పలేదని, కనుక తమకేమీ తెలియదని’ గోయల్ అన్నాడు. ఈ కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలని నర్సింగ్ చేసిన డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరిస్తుందా? అన్న ప్రశ్నకు గోయల్ సమాధానాన్ని దాటవేస్తూ, ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది. మేమేమీ చేయలేము. ముందు ఈ విషయంపై నాడా (జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ) కమిటీలను తేల్చనీయండి. ఆ తర్వాత మేము పరిశీలిస్తాం’ అని చెప్పారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి గోయల్